వార్ 2 ఫుల్ స్టోరీ లీక్.. తారక్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..!

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్.. తాజాగా దేవర లాంటి బ్లాక్ బ‌స్టర్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ జోష్‌లో వార్ 2తో బాలీవుడ్‌కి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్‌. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్యన జరిగే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్, ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించే రేంజ్‌లో ఉంటాయని తెలుస్తోంది. దాదాపు షూట్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. 2019లో రిలీజ్ అయిన వార్‌ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో పాటు టైగర్ ష్ర‌ఫ్ నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది.

BREAKING NEWS : Jr.NTR joins Hrithik Roshan in WAR 2 🔥 Shooting Starts  November 2023 #hrithikroshan #bollywood #ayanmukerji #jrntr #jrntrfans #yrf  #yrfspyuniverse #hrithik #breakingnews #war2 #war #news #weekday #wednesday  #wednesdaywisdom #action ...

ఈ క్రమంలోనే వార్ 2పై కూడా ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ ఇదేనంటు ఓ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. కబీర్ సింగ్ (హృతిక్ రోషన్) కోవర్ట్ ఇంటర్నేషనల్ టాస్క్‌ ఫోర్స్‌ లీడర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇండియాకి వీరేంద్ర రఘునాథ్ (ఎన్టీఆర్) నుంచి భారీ ముప్పు ఏర్పడుతుంది అంతర్జాతీయ స్థాయిలో వీరేంద్ర టెర్రరిస్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేసి భారతదేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే స్థాయిలో ఏజెంట్గా నిలుస్తాడు. కానీ కబీర్ సింగ్ లీడ్ చేస్తున్న టీంలోని శత్రు దేశ టెర్రరిస్టులను అంతం చేసేందుకు వీరేంద్ర వెళ్ళినప్పుడు.. వీరేంద్రకు వెన్నుపోటు పొడిచి శత్రువులకు వదిలేసి క‌బీర్ వెళ్ళిపోతాడు. వాళ్ళ నుంచి తప్పించుకున్న వీరేంద్ర దేశం కోసం ప్రాణాలు సైతం ఇవ్వాలనుకున్న తనని.. అంతలా దొంగ దెబ్బ తీసారన్న కసితో టెర్రరిస్ట్‌గా మరి ముఖ్యంగా తనని వెన్నుపోటు పొడిచిన కబీర్ పై పగ పెంచేసుకుంటాడు.

Jr NTR will reportedly make his Hindi film debut with War 2, will lock  horns with Hrithik Roshan | t2ONLINE

కానీ.. వీరేంద్రకు ఇంత అన్యాయం జరిగిందనే విషయం కబీర్‌కు తెలియదు. ఇక చివరిలో వీరేంద్ర ఈ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత సృష్టించిన టెర్రరిస్ట్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడా.. లేదా.. అదే మూర్ఖత్వాన్ని దేశద్రోహిగా కొనసాగిస్తాడు అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా స్టోరీ లైన్ మొత్తం విన్న తర్వాత చాలామందికి పటాన్ మూవీ స్టోరీ లైన్ లాగా అనిపిస్తుందని.. అందులో కూడా జాన్ అబ్రహంని ఇలా సొంత దేశానికి చెందిన వాళ్లే మోసం చేయడంతో పగతో టెర్రరిస్ట్‌గా మారిపోతారు. అదే తరహా స్టోరీలు ఇందులో కూడా చూపించార‌ని టాక్‌ నడుస్తుంది. స్టోరీ లైన్ ఒకటే అయినా స్క్రీన్ ప్లే వేరుగా ఉండబోతుందట‌. కనుక బాక్సాఫీస్ దగ్గర భయపడాల్సిన పనిలేదు. అయితే ఎన్టీఆర్‌ని ఈ రేంజ్‌లో నెగటివ్ రోల్ లో చూపిస్తే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారా.. లేదా ఆయన నటనను ఎంజాయ్ చేస్తారా.. అనేది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది.