టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. గాడ్ ఆఫ్ మాసెస్.. నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీలో పద్మ అవార్డులు దక్కించుకున్న రెండో వ్యక్తిగా బాలయ్య నిలిచారు. అంతకుముందు 1968లో బాలయ్య తండ్రి దేవిగత నటుడు ఎన్టీఆర్‌కు పద్మశ్రీ అవార్డు రాగా.. ఎన్టీఆర్‌తో పాటు.. అక్కినేని నాగేశ్వరరావు కూడా ఈ పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు. దాదాపు 56 ఏళ్ల తర్వాత మళ్లీ నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్యకు పద్మభూషణ్ దక్కింది. దీంఓ సినీ ఇండస్ట్రీతో పాటు.. నందమూరి ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే బాలయ్య సోదరుడు హరికృష్ణ కొడుకులు.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు కూడా సోషల్ మీడియా వేదికగా బాల బాబాయ్ కంగ్రాట్స్ అంటూ సంతోషకర పోస్ట్ షేర్ చేసుకున్నారు. అయితే.. తాజాగా కళ్యాణ్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం ఎదురయ్యింది. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలయ్యకు విషెస్ తెలియజేస్తూ.. వివిధ పత్రికలను ప్రకటనలు ఇచ్చారు. ఇందులో ప్రతి ఒక్క నందమూరి సోదరులు, సోదరీమణుల, కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించారు. కానీ.. ఎన్టీఆర్, ఆమె తల్లి షాలిని పేర్లు.. అలాగే కళ్యాణ్ రామ్ పేరును ఎక్కడ ప్రస్తావించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది.
అయితే హరికృష్ణ తల్లిదండ్రులైన కీర్తి శేషులు హరికృష్ణ, శ్రీమతి లక్ష్మీ పేర్లు కూడా అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట వైరల్ గా మారడంతో.. ఎన్టీఆర్కు మరోసారి ఘోర అవమానం జరిగిందంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ తల్లి షాలిని హరికృష్ణ రెండో భార్యగా నందమూరి కుటుంబ సభ్యురాలిగా.. వారెవరు భావించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బాలయ్యకు పద్మభూషణం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ట్విట్ చేసినప్పటికీ బాలయ్య కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన మనసు అసలు కరగలేదు.. ఈ పేపర్ యాడ్ దానికి సాక్ష్యం అంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.