ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బూరిబుగ్గల బుడ్డోడు ఓ స్టార్ హీరో. అతని తండ్రి.. అలాగే తన అన్నయ్య సైతం స్టార్ స్టేటస్‌ను అందుకొని మంచి ఇమేజ్‌తో దూసుకుపోయాడు. అయితే.. తన కుటుంబంలో తోబుట్టువులకు, తండ్రికి వచ్చిన క్రేజ్ మాత్రం ఈ కుర్రాడికి రాలేదు. హీరోగా పాన్ ఇండియా సినిమాలో నటించిన ఊహించిన సక్సెస్ అందుకపోవడంతో ఫేడౌట్ అయిపోయాడు. ఫలితంగా.. ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. తర్వాత అవకాశాలు లేక సినిమాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మాత్రం తన 55 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. కేరళలో ఎన్నో మలుపులు చూసిన ఆయన.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల పాత్ర నడివి అతి తక్కువ అయినప్పటికీ.. ఓ స్టార్ హీరో రేంజ్‌లో రెమ్యూనరేషన్‌ను, అదే రేంజ్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.
కేవలం తన పదిహేను నిమిషాల నటన కోసం ఏకంగా నాలుగు కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడు అంటే అతని పాపులారిటీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ నటుడెవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఎస్ మీ గెస్ కరక్టే.. అతనే బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్. 27 జనవరి 1969 ముంబైలో పుట్టిన ఈయన సీనియర్ హీరో ధర్మేంద్ర చిన్న కొడుకు. 1977లో తండ్రి ధర్మవీర్ సినిమాతో బాల నటుడిగా.. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. 1995లో బర్సాత్ సినిమాతో ప్రధానమంత్రిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు ఫిలింఫేర్ బెస్ట్ డబ్బింగ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. తర్వాత పలు హిట్ సినిమాలలో నటించినా మెల్లమెల్లగా.. ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.
దీంతో కొన్నాళ్ళు వెండితెరకు దూరమయ్యాడు. అయితే మళ్ళీ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో తెరకెక్కించిన యానిమల్‌తో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. కేవలం 15 నిమిషాల అతని పాత్ర.. సినిమాకి ఐకాన్‌గా మారింది. కాగా.. ఈ సినిమా కోసం నటుడు నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. యానిమల్ తర్వాత బాబీకి అవకాశాలు క్యూ కట్టాయి. అటువైపు వెబ్ సిరీస్‌లోను నటిస్తూ.. ఇటు కంగువ సినిమాలోను మెరిసాడు. ఇక తాజాగా వెల్లడించిన పలు నివేదికల ప్రకారం.. బాబి డియోల్ నికర ఆస్తుల విలువ రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఓటీటీ ప్రాజెక్టుల నుంచి కూడా సంపాదన అర్జిస్తున్న బాబి డియోల్.. కుటుంబంతో కలిసి ముంబైలోని జోహార్ లో విలాసవంతమైన బంగ్ళాలో లైఫ్ లీడ్ చేస్తున్నాడు. 1996లో తాన్య అహుజా ను వివాహం చేసుకున్నాడు. ఇక తాన్యా ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్. అలాగే.. ఇంటీరియర్ డిజైనర్ కూడా. ఇక ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.