ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారిలో గ్లామరస్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా ఒకటి. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్‌లోనే అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందచందాలతో ఆకట్టుకుంటూ.. యూత్ క్రష్‌గా మారిపోయింది. ఇక శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో జాన్వి ఎంట్రీ సులభంగా వచ్చినా.. తన పేరును నిలబెట్టుకుంది. అందం, అభినయంతో పాటు.. తన మాట తీరును మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. రాంచరణ్ సరసన ఆర్సి16 సినిమాలో నటించనుంది.
సోషల్ మీడియా వేదికగా జాన్వి గ్లామర్ ఫోటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. దీంతో ఈ అమ్మకి బోల్డ్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ వచ్చింది. అప్పుడప్పుడు పొట్టి డ్రస్సులతో పార్టీలో సందడి చేసే జాన్వి.. నెటింట ట్రోలింగ్స్‌కు కూడా గురవుతుంది. అయితే తాజాగా ఆమె గ్లామర్ గురించి.. కండోమ్ సంస్థ అధినేత చేసిన కామెంట్స్ వివాదాలకు దారి తీసాయి. ఆయన జాన్వీ కపూర్‌ను ఉద్దేశిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాన్ ఫోర్ సంస్థ ఫౌండర్ రాజీవ్ జునేజ.. ఓ ఇంటర్వ్యూలో జాన్వి గురించి వెల్లడించాడు. కండోమ్ బ్రాండ్ కు సినీ తారలు, మోడల్స్ యాడ్ చేయడం సహజమే. కానీ రాజీవ్.. జాన్వి కపూర్ అనుమతి లేకుండా ఆమె పేరును ప్రస్తావిస్తూ తమ బ్రాండ్ కండోమ్స్ యాడ్‌ని జాన్వి కపూర్ చేయడం బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకొచ్చాడు.
అదేవిధంగా రణ్‌బీర్ కపూర్ కూడా అంటూ వెల్లడించాడు. వీళ్లిద్దరూ కలిసి కండోమ్ యాడ్ చేస్తే ఇక తిరిగే ఉండదంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ కామెంట్స్ జాన్వి కపూర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఆయన ఉద్దేశం జాన్వీ కపూర్‌కు శృంగారపరమైన ఇమేజ్‌ను ఆపాదించడమే అంటూ ఇన్ డైరెక్ట్‌గా జాన్వి అలాంటి వాటికే పనికొస్తుందంటూ కామెంట్స్ చేశాడని మండిపడుతున్నారు. కండోమ్ యాడ్ అనేది తన వ్యక్తిగత నిర్ణయం. ఆమె అనుమతి లేకుండా ఇలాంటి అసభ్యకర కామెంట్స్ చేయడం అస్సలు సక్యం కాదు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్న జాన్విపై ఇలాంటి కామెంట్లు చేయడమేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక జాన్వి దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.