ఓజి ఇంటర్వెల్ బ్యాక్‌.. పవన్ అతని తల నరికే సీన్‌కు ఫాన్స్‌లో గూస్ బంప్స్ మోతే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న‌ హీరోల నుంచి పెద్ద స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ సక్సెస్ కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అయితే వాళ్ళ క్రేజ్ అనేది పెరుగుతుందా.. లేదా.. అనేది మాత్రం వాళ్ళు ఎంచుకునే కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతో తెలుగు సినిమా ఖ్యాతి కూడా అదే రేంజ్‌లో ఎదుగుతుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు చెబితే మొదటి నుంచి ఎక్కువగా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే.. ఆయన స్టార్‌డం ఆ రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య.. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే ఫస్ట్ డే ఫస్ట్ రోజు అక్కడ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు.

OG Glimpse: It's a fricking blood bath! PK in his most fiercest avatar!

ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటిషన్ గాను బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తన సినిమాలను మాత్రం వదులుకోలేదు. దానికి కారణం ఫ్యాన్స్ పెట్టుకొని అభిమానమని.. ఒక్కసారిగా సినిమాలు మానేస్తే వాళ్ళు ఫీలవుతారని ఉద్దేశంతోనే సినిమాలు ఆపడం లేదంటూ చెప్పుకొచ్చాడు. అలా ఇప్పటికి హరిహర వీరమల్లు సినిమా షూట్ ను ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్న పవన్.. నెక్స్ట్ ఓజి సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. త్వరలోనే ఆ సినిమా షూట్‌ని కూడా పూర్తి చేసుకుని రిలీజ్ చేసేలా ప్రణాళికల రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న టాక్ ప్రకారం ఓజి సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేయబోతుందని సమాచారం. ఇలాంటి క్రమంలో ఓజి ఇంటర్వెల్ సీక్వెన్స్ సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటంట‌ వైరల్‌గా మారుతుంది.

Pawan Kalyan's OG music work begins | Latest Telugu cinema news | Movie  reviews | OTT Updates, OTT

పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ బ్యాక్ సీన్ గురించి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జనాలకు అన్యాయం చేసే పోలీస్ ఆఫీసర్‌ను పవన్ డైరెక్ట్‌గా స్టేషన్‌కు వెళ్లి మరీ కొట్టి వాడి తల నరికేస్తాడట. అప్పుడే ఇంటర్వెల్ పడుతుందని ఓ టాక్‌ నడుస్తుంది. ఇదే న్యూస్ నిజమైతే సినిమాపై ఆడియన్స్‌లో మరో లెవెల్‌లో అంచనాలు పెరుగుతాయ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం వైరల్ అవ్వడంతో మిగతా సినిమా మరో లెవెల్‌లో ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా పవన్ నుంచి గత కొంతకాలంగా సినిమానే రాలేదు. ఈ సినిమాతో మరోసారి తన స్టార్‌డం ఆడియన్స్‌కు చూపించే విధంగా కథను క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల కాలంలో పవన్ కూడా స్వయంగా ఓజి సినిమా చాలా బాగుంటుందంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై ఆడియన్స్‌ను మంచిగా ఉన్నాయి. డైరెక్టర్ సుజిత్ కూడా సినిమాను హాలీవుడ్ ట్రెండ్‌లో తెరకెక్కిస్తుండడం ఆశ్చర్యం. ఏదేమైనా.. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా.. లేదా అనేది మాత్రం రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.