ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి.. తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కొందరు యూట్యూబర్ల కారణంగా ఫొటోస్, వీడియోస్ నెటింట తెగ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఎక్కడ చూసినా ఆమె ఫొటోస్, ఆమె వార్తలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో మోనాలిసాకు తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆయన మాటను నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం మధ్యప్రదేశ్ ఇండోర్ లోని కార్బన్ జిల్లా మహేశ్వర్.. మోనాలిసా ఇంటికి వెళ్లి మరి ఆమె తండ్రికి పరిశ్రమ గురించి వెల్లడించాడు. అలాగే సందేహాలను క్లియర్ చేసిన మిశ్రా.. ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జైసింగ్ బోన్స్‌లేను ఒప్పించారు. ఈ క్రమంలోనే తన కుమార్తెను నటింపజేసేందుకు జై సింగ్ ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్స్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. సనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న.. ది డైరీ ఆఫ్ మణిపూర్‌లు మోనాలిసా కనిపించనుంది.
ఇందులో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురుగా కనిపించడం ఉందని టాక్. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనునట్లు టాక్. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కపూర్ రావు సోదరుడు అమిత్ రావు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ నుంచి షూట్లో మోనాలిసా హాజరుకానుందట. ఇక ఈ ఏడది అక్టోబర్ నాటికి సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.