టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్‌లో నెగటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసే హీరోగాను తారక్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్లకు హిట్ ఇవ్వడంలో తారక్ సక్సెస్ సాధిస్తున్నాడు. 2017 లో వచ్చిన టెంపర్ మొదలుకొని తాజాగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర వరకు చాలా సినిమాలతో ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇచ్చాడు తారక్. అలాగే రాజమౌళితో సినిమా చేసిన హీరో నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఎప్పటినుంచో కొనసాగుతుంది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సెంటిమెంట్‌ను దేవరతో బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు.
ఈ క్రమంలోనే తాజాగా తారక్ మరో నెగటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తమిళ్ డైరెక్టర్ నెల్సన్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇక నెల్సన్ దిలీప్ చివరిగా రజనీకాంత్ హీరోగా జైలర్ 2 సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే నెల్సన్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో తారక్ సినిమా చేయడం ఫ్యాన్స్‌కు ఒక్కింత ఆనందాన్ని కలుగజేస్తున్న మరో పక్కన నెగటివ్ సెంటిమెంట్ వాళ్ళల్లో ఆందోళన పెంచేస్తుంది. ఇంతకీ ఆ నెగటివ్ సెంటిమెంట్ ఏదో కాదు.. తమిళ్ డైరెక్టర్‌తో తెలుగు హీరో సినిమా చేస్తే అది ప్లాప్ అనే నెగటివ్ సెంటిమెంట్ కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.
ఇటీవల మరోసారి అది ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌గా నిలిచింది. అంతకుముందు సముద్రఖని డైరెక్షన్‌లో పవన్, సాయి ధరంతేజ్ చేసిన బ్రో, మురుగదాస్ డైరెక్షన్లో మహేష్ నటించిన స్పైడర్ ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా సినిమాలు ఫలితాలు డిజాస్టర్లుగానే నిలిచాయి. అలాగే లింగస్వామితో.. ది వారియర్ సినిమా చేసిన రామ్, వెంకట ప్రభుతో కస్టడీ ఇలా వరుసగా టాలీవుడ్ హీరోస్ తమిళ్ డైరెక్టర్ తో సినిమాలు తెరకెక్కించి ప్లాప్‌లు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌ను తారక్ – నెల్సన్ డైరెక్షన్‌లో నటించి బ్రేక్ చేస్తాడా.. లేదా.. అనే సందేహాలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి.
ఇటీవల దేవరతో మెప్పించిన తారక్.. బాలీవుడ్ ఫిలిం వార్ 2 తో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. వీటి తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ డైరెక్షన్‌లో ఓ సినిమా నటించనున్నాడు. ఇక ప్రొడ్యూసర్ నాగ వంశి.. ఎన్టీఆర్ – నెల్సన్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 25న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌గా ప్రకటన ఇవ్వనున్నారని టాక్. మొత్తానికి తమిళ్ డైరెక్టర్ నెలసన్‌తో ఎన్టీఆర్ సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే తారక్ మరోసారి బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసి శుభం కార్డు వేస్తాడా లేదా వేచి చూడాలి.