టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రఫ్ అండ్ రగడ్ లుక్ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాకు హీరోయిన్‌గా మెరవనుంది. ఈ సినిమా తర్వాత చరణ్.. సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో అల్లు అరవింద్ రామ్ చరణ్ కోసం భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అల్లు, మెగా ఫ్యామిలీ మధ్యన వివాదాలు ఉన్నాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే చాలావరకు పరిణామాలు కూడా కనిపించాయి.
ఇలాంటి క్రమంలో.. తండేల్ డైరెక్టర్ చందు మొండేటి.. అల్లు అరవింద్ గురించి వివరిస్తూ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. అల్లు అరవింద్ గారు.. చరణ్‌తో రూ.300 కోట్ల బడ్జెట్లో భారీ సినిమాను ప్లాన్ చేశారని.. ఈ సినిమాకు డైరెక్టర్ గా నన్నే సెలెక్ట్ చేసుకున్నారంటూ చెప్పుకొచ్చాడు చంద్ర మొండెటి. కథ కూడా సిద్ధంగా లేకపోవడంతో అది కుదరలేదని.. కానీ నాకు అల్లు అరవింద్ గారు ఆ ఆఫర్ ఇచ్చారంటూ వెల్లడించాడు. చందు మండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 సినిమా ఆయనకు విపరీతంగా నచ్చడంతో ఈ అవకాశం తనకు వచ్చిందని.. కానీ ఆ సినిమా కుదరడం లేదు అంటూ వెల్లడించాడు. చివరకు నాగచైతన్యత తండేలు ఫిక్స్ అయిందంటూ వివరించిన ఆయన.. రూ.300 కోట్ల బడ్జెట్ సినిమాలో చరణ్‌తోకాని.. సూర్యతోకాని.. చేయాలన్నది అల్లు అరవింద్ ఆలోచన అని వివరించాడు.
సూర్యతో తన సినిమా చేయబోతున్నట్లు చందు మొండేటి ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు. ఇక రామ్ చరణ్‌తో ఫ్యూచర్‌లో తప్పకుండా సినిమా చేస్తానంటూ వెల్లడించాడు. చందు ముండేటి చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం చందు మొండేటి – నాగచైతన్య కాంబోలో తెరకెక్కిన తండేల్ సినిమాకు సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా వచ్చిన ట్రైలర్లో చైతు, సాయి పల్లవి నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. మరోసారి వీరిద్దరు వెండితెరపై మ్యాజిక్ రిపీట్ చేస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.