మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ టైంలోనే ప్రకటించారు. లాక్‌డౌన్ టైంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రేక్ పడటంతో అదే సమయంలో ఆన్లైన్ ద్వారా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతున్న ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాను జక్కన్న సెట్స్ పైకి తీసుకురాలేదు. దీనిపై ఒకసారి విజయేంద్రప్రసాద్ రియాక్ట్ అవుతూ.. మహేష్ బాబు కోసం కథ రాయడం అంత సులభం కాదు.. ఏకంగా నాకు రెండేళ్ల సమయం పట్టింది అంటూ వివరించాడు. ఇక తాజాగా SSMB29 షూటింగ్‌కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ఇటీవల హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అత్యంత రహస్యంగా మీడియాకు అనుమతి ఇవ్వకుండా పూజ కార్యక్రమాలను పూర్తి చేశారు. కనీసం ఫోటోలు కూడా బయటకు రానివ్వలేదు. అక్కడ కొన్ని సన్నివేశాలు కూడా షూట్ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రాజమౌళి త్వరలో కెన్యా దేశంలోని అడవుల్లో షూట్ ప్రారంభించనున్నాడట. కాగా SSMB29 జంగల్ అడ్వెంచర్ డ్రామా అని ఇప్పటికే రాజమౌళి వివరించారు. ఇక మూవీలో మహేష్‌కు జంటగా ప్రియాంక నటిస్తుందంటూ ప్రచారం జరిగింది. దానిపై తాజాగా అఫీషియల్ ప్రూఫ్ బయటకు వచ్చింది. ప్రియాంక చోప్రా, రాజమౌళి, కిరవాణి కలిసి ఉన్న లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. SSMB29 హీరోయిన్ ప్రియాంక అని ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ఇక యూనివర్సల్ సబ్జెక్టుతో ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్న క్రమంలో.. హాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ప్రియాంక అయితే పర్ఫెక్ట్ అని జక్కన ఆమెను ఎంచుకున్నాడని తెలుస్తుంది. కాగా.. వీళ్ళు ధరించిన డ్రెస్‌లపై ప్రస్తుతం NT WINE అని లోగో ఉండడం అతిపెద్ద సస్పెన్స్‌గా మారింది. అయితే ఇది ఒక మ్యూజిక్ బ్యాండ్ పేరు కావడంతో.. సినిమాకు ఆ మ్యూజిక్ బ్యాండ్‌కు ఏదైనా సంబంధం ఉండి ఉంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూన్నారు నెటిజన్స్. మరి కొంతమంది అసలు NT WINE మూవీ టైటిల్ అయి ఉంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే లోగోకు సినిమాకు ఉన్న సంబంధం ఏంటో మేకర్స్ క్లారిటీ ఇస్తే కాని తెలియదు. ఇక ఈ సినిమా కోసం మహేష్ జుట్టు బాగా పెంచి ఎప్పుడు చూడని డిఫరెంట్ లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసం మహేష్ కేటాయించినట్లు సమాచారం.