టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకువచ్చారు .. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఇప్పటికి క్యూ కూడుతున్నారు ..
దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు దిశగా పరుగులు పెడుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫార్మ్ బుక్ మై షో లో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది .. ఇక ఈ సినిమా ఏకంగా 3.3 మిలియన్ టిక్కెట్లు బుక్ అయినట్లు బుక్ మై షో ప్రకటించింది .. ఓ తెలుగు సినిమాకి ఈ స్థాయిలో టికెట్ బుకింగ్ జరగటం రికార్డ్ అని చెప్పాలి ..
పాన్ ఇండియా సినిమా కాకుండా కేవలం తెలుగులో మాత్రమే ఈ సినిమా ఈ ఫీట్‌ను సాధించడం నిజంగా విశేషం. ఈ సినిమాలో వెంకటేష్ కు జంటగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించరు దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు .. ఈ సినిమాతో దిల్ రాజు గేమ్ చేజర్ నష్టాలు మొత్తం సంక్రాంతికి వస్తున్నాం సినిమా భర్తీ చేసింది. వెంకటేష్ , అనిల్ రావిపూడి ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.