నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న గడియలు రానే వచ్చాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయింది. గత కొద్ది నెలలుగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న టీం.. సెట్స్ పైకి త్వరలోనే సినిమాను తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీ అయ్యారట. ఈ క్రమంలోనే మోక్షజ్ఞతో జోడి కట్టబోయే హీరోయిన్ సెలక్షన్ కూడా పూర్తయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. […]