సినీ ఇండస్ట్రీలో ఏ ప్రొఫెషన్‌లో అయినా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అది చాలా కష్టతరమైనపని. అలాంటిది ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం మరింత కష్టం. ఇక ఓ సినిమా తెరకెక్కించి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలకు ఓ పక్కన పాజిటివ్ కామెంట్లతో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వెళ్లడవుతు ఉంటాయి. అలాంటి సినిమాలను తెరకెక్కించే దర్శకులు టాలీవుడ్ లో చాలా రేర్ గా ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో సందీప్ రెడ్డి వంగ ఒకడు. ఆయన తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోగా ఇండియా లెవెల్‌లో తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు సందీప్.
తన డైరెక్షన్లో తెరకెక్కిన మొదటి మూవీ అర్జున్ రెడ్డి ఇప్పటికీ ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటున్నారంటే ఆ సినిమా ఏ రేంజ్లో జనాలపై ఇంఫ్యాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఎప్పుడూ మర్చిపోలేని రేంజ్‌లో అర్జున్ రెడ్డి సీన్స్ ను సందీప్ రెడ్డి తెరకెక్కించాడు. ఇక.. యానిమల్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. మొదటి సినిమాలో రష్మిక క్యారెక్టర్ ను బూతులు తిట్టిన జనాలే.. రష్మిక నటన బాగుందంటూ తర్వాత ప్రశంసలు కురిపించారు. అంతలా సందీప్ రెడ్డి వంగ జనాల పల్స్ పట్టి సినిమాల రూపొందిస్తాడు. అయితే త్వరలోనే సందీప్ రెడ్డి .. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను రూపొందించనున్నాడు. ఇక ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ కోసం చేసిన మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది అంటూ ఓ అప్డేట్ వైరల్ గా మారుతుంది.
ఈ మూవీలో ప్రభాస్‌కు తల్లిదండ్రుల పాత్రలో సీనియర్ స్టార్ హీరో, హీరోయిన్లు కనిపించనున్నారట. అది కూడా తండ్రిగా మెగాస్టార్ చిరంజీవిని సందీప్ చూపించబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఆయనకు భార్యగా సెన్సేషనల్ బ్యూటీ రమ్యకృష్ణ ని ఫిక్స్ చేసినట్లు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గాని.. చిరంజీవి, రమ్యకృష్ణ కాంబో అంటేనే సూపర్ డూపర్ హిట్ కాంబో అని తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ ఏజ్‌లో వీళ్ళ కాంబో ఎలా ఉండబోతుందో.. సందీప్ రెడ్డి వంగ ఎలాంటి పాత్రల్లో వీళ్ళని చూపించబోతున్నాడో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైపోయింది. ఇక ఈ వార్త వాస్తవమైతే.. చిరు, రమ్యకృష్ణ, ప్రభాస్ లను ఒకే స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ఫ్యాన్స్ కు పూనకాలు కాయమనడంలో సందేహం లేదు. బాహుబలి 2, పుష్ప 2 రికార్డులను పటాపంచలు చేస్తూ రెబల్ స్టార్ స్పిరిట్ సంచలనం సృష్టిస్తుందఏటూ అభిప్రాయిలు వ్యక్తమవుతున్నాయి. ఇక సందీప్ రెడ్డి చేసి సినిమాను ఏ రేంజ్‌లో రూపొందిస్తాడో వేచి చూడాలి.