టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన నటన, డ్యాన్స్, మాటతీరుతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న తారక్.. రాజమౌళి డైరెక్షన్‌లో బచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరోసారి దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తారక్ క్రేజ్, మార్కెట్ మరింతగా పెరిగిపోయింది.
రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయనునట్లు సినిమా రిలీజ్ కు ముందే కొరటాల వెల్లడించాడు. ఫస్ట్ భాగం కేవలం ఇంట్రడక్షన్ మాత్రమేనని.. అసలు కథ రెండో భాగంలో ఉందని మూవీ టీం వివరించారు. ఇక దేవర తర్వాత తారక్ బాలీవుడ్ మూవీ వార్ 2 సినిమాలో బిజీ అయిపోయారు. ఈ సినిమా అనంతరం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ టైటిల్‌తో మరో సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలు పూర్తి అయిన వెంటనే.. తిరిగి కొరటాల డైరెక్షన్‌లో దేవర కంటిన్యూషన్ దేవర పార్ట్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. కాగా.. ఇలాంటి క్రమంలో దేవర 2 సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారుతుంది.
ఈ సినిమాలో కొరటాల శివ ఎక్కువగా యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నాడని సమాచారం. ఇక రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చాలా వరకు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఆడియన్స్ ఊహించని రేంజ్‌లో ట్విస్టులు, మలుపులు ఉంటాయని.. భారీ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకోనున్నాయని సమాచారం. ఇక ఇప్పటికే పూర్తయిన స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేస్తూ.. పుష్ప 2 తరహాలో.. సినిమాను మరింత పవర్ ఫుల్‌గా రూపొందించాలని కొరటాల ఆలోచనలు చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఏడాది చివరిలో.. లేదా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మొదలు కానుందని సమాచారం.