సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది ఇప్పటికే బహిరంగంగానే వివరించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కోచ్, కమిట్మెంట్ల గురించి పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా.. స్టార్ హీరోయిన్లు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు. కమిట్మెంట్ ఇచ్చినా ఆఫర్ రావడంలేదని.. ఇటీవల ఓ తెలుగు నటి చెప్పుకొచ్చింది. ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ సినీ పరిశ్రమలో ప్రకంపనులు సృష్టిస్తుండటం చూస్తూనే ఉన్నాం.
మలయాళ సినీ పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల కథనాలు విని ఆశ్చర్యపోయామని కమిషన్ నివేదిక ఇటీవల వెల్లడించింది. ఇలాంటి క్రమంలో తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ తన లైఫ్ లో ఎదుర్కొన లైంగిక వేధింపుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఫాతిమా సనా షేక్. పేరు చెప్తే టక్కున గుర్తుకు రాకపోవచ్చు.. ఫోటో చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ అమ్మడు దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక తాజాగా ఫాతిమా క్యాస్టింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఓ తెలుగు నిర్మాత నన్ను కలిసినప్పుడు ఆయన నాతో ప్రవర్తించిన తీరు చాలా ఇబ్బందిగా అనిపించిందని.. ఫాతిమా సనా షేక్ వివరించింది. మీకు అవకాశం కావాలంటే ప్రతి పనిని చేయడానికి రెడీ అయి ఉండాలి.. ఏది చేయడానికైనా ఒప్పుకోవాలి అన్నాడని.. రాత్రికి రమ్మని నేరుగా అడుగుతారు అంటూ నిర్మాత కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారని చెప్పుకొచ్చింది. ఇక వెంటనే తను సినిమాలో ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.. కానీ ఇలాంటి పనులు చేయనని చెప్పి అక్కడి నుంచి వచ్చేసానని ఫాతిమా వివరించింది. ఇక ఫాతిమా ప్రస్తుతం తను నటించిన ‘ నువ్వు నేను ఒకటవుదాం ‘ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించింది.