టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా.. ఎంతో ప్రెస్టేజియస్‌గా రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ గతంలోనే జరిగినా.. రీసెంట్గా సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా రికార్డులను తిరగ రాయడం ఖాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. కాగా.. రాజమౌళి తన సినిమాతో మరోసారి సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న జక్కన్న.. పాన్ వరల్డ్ రేంజ్‌లో సినిమాను తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడట.
ఈ క్రమంలోనే సినిమా కాస్టింగ్ సెలక్షన్‌లోనూ ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సినీవర్గాల సమాచారం. ఇప్పటికే లీడ్ ఫిమేల్ నటిగా స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాను రాజమౌళి ఎంపిక చేశాడని న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఆమె కూడా సెట్స్‌లో జాయిన్ అయిందని టాక్. కాగా.. ఈ సినిమాలో విలక్షణ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ ఓ కీలకపాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలు గతంలో బాగా వినిపించాయి. కానీ.. ఇప్పుడు ఆయన స్థానంలో ఈ సినిమాను నటించేందుకు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సెలెక్ట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. సినిమాను మాత్రం పూర్తి అడ్వెంచర్స్ థ్రిల్లర్గా తెరకెక్కించేందుకు యూనిట్ పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. కేఎల్ నారాయణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక సినిమాలో దాదాపు 1000 కోట్లు బడ్జెట్లో రూపొందించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా రాజమౌళి స్ట్రిక్ట్ టర్మ్స్, కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.