తండేల్ కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారుగా.. ఇక భారమంతా వాళ్ళ మీదే.. !

టాలీవుడ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెర‌కెక్కనున్న తాజా మూవీ తండేల్‌. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వ‌చ్చిన లవ్‌స్టోరీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్ పై తమ కెమిస్ట్రీని వర్కౌట్ చేయనున్నారు. చందు మొండేటి డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పకుడిగా.. బన్నీవాస్ నిర్మాతగా రూపొందించారు. నాగచైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఫిబ్రవరి 7న ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌లో ఆల్మోస్ట్ కథ‌ అంత చెప్పేసారంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

రాజా ఊళ్లో మన గురించి అంత ఏటేటో మాట్లాడుకుంటున్నారు రా.. అనే సాయి పల్లవి డైలాగ్ తో ట్రైలర్ కట్ మొదలుకాగా.. వాళ్లనుకున్నదే నిజం చేద్దామంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ఆశ‌క్తి క‌ల్పిస్తుంది. అక్కడ నుంచి వాళ్ళ లవ్ స్టోరీ మొద‌లైంది.. ఇక‌ తరచు చేపల వేటకు వెళ్లే అతను ఆమెకు దూరం అవుతూ వస్తాడు. కానీ.. ఒకసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడ చిక్కుకోవడం.. అక్కడినుంచి ట్రైలర్ సరికొత్త ట్రాక్ లోకి వచ్చింది. దైవభక్తి వైపు మళ్ళింది. మా దేశంలో ఉన్న ఊర కుక్కలు అన్నింటిని ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుందంటూ నాగచైతన్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Naga Chaitanya's fierce look in Thandel's b'day poster wows fans | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతర అంటూ చైతు చెప్పిన డైలాగ్ మెప్పించింది. ఇక ట్రైలర్ కట్ చూస్తే చందు మొండేటి ఏదో భారీగా ప్లాన్ చేసినట్లు అనిపించినా.. ఊహించిన రేంజ్‌లో సస్పెన్స్ మాత్రం ట్రైలర్‌లో లేదు. ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఆడియన్స్‌లో కలుగుతుంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌లో హైప్‌ వచ్చే మూమెంట్స్‌ను చూపించలేదని.. కథ మొత్తం రివీల్‌ చేసినట్లు ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తెరపై సాయి పల్లవి, చైతన్య తమ యాక్టింగ్ తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయాల్సిందే. లేదంటే.. రిజల్ట్ మరోలా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ జంట‌ తమ మ్యాజిక్ రిపీట్ చేస్తారో.. లేదో.. వేచి చూడాలి.