బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తాజాగా దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్‌లో సౌత్ హీరోలకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే షారుక్‌ఖాన్.. ఆ స్టార్ హీరోల గురించి పేర్లతో సహా చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఈవెంట్లో షారుక్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్, ప్రభాస్, చరణ్, మహేష్, విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు సౌత్ స్టార్స్ అంత నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ నవ్వుతూ వారి గురించి సరదాగా చెప్పిన సంభాషణ నెటింట వైరల్‌గా మారడంతో.. ఈ స్టార్ హీరోల అభిమానులు షారుక్‌కు ఫిదా అవుతున్నారు.
కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అభిమానులను ఉద్దేశించి షారుఖ్ ఖాన్ ఆప్యాయంగా పలకరించాడు. నాకు దక్షిణ భారతదేశం నుంచి చాలామంది స్నేహితులు ఉన్నారంటూ వెల్లడించిన ఆయన.. రజనీ సార్, కమల్ సార్ అంటూ తన సీనియర్లను గౌరవ మర్యాదలతో వ్యాఖ్యానించడం వైరల్ గా మారుతుంది. దీంతో అభిమానులు షారుక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక షారుక్ ఖాన్ మాట్లాడుతూ పలువురు సౌత్ స్టార్స్ పేర్లు చెప్తూ.. నేను మీ అందరిని ఒకటే అభ్యర్థిస్తున్న మీరు చాలా వేగంగా డ్యాన్స్ చేయడం మానుకోండి.
మీతో పాటు డ్యాన్సులు చేయడం నాకు కష్టమవుతుంది అంటూ ఆయన కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్, చరణ్ ఇలాంటి స్టార్ హీరోలను ఉద్దేశిస్తూ ఇలాంటి కామెంట్స్ చేయడంతో.. సౌత్ స్టార్ హీరోల పై తనదైన స్టైల్ లో అభిమానాన్ని కురిపించడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే షారుక్ ఖాన్ సినిమాలపై.. టాలీవుడ్ హీరోస్ మహేష్, అల్లు అర్జున్, చరణ్ లాంటి హీరోస్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. షారుక్ ఖాన్‌పై తమ అభిమానాన్ని వెల్లడించారు. వారికి షారుక్ తిరిగి రిప్లై కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అతావారి మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.