ఈ పై ఫోటోలో స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్న పొట్టి పిల్లను గుర్తుపట్టారా. ఈ చిన్నది టాలీవుడ్ స్టార్ బ్యూటీ. కానీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలంటే.. అదృష్టం కూడా ఉండాలి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎంతమంది స్టార్ హీరోయిన్స్ తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా లక్ లేక ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. ఈ పై ఫోటోలో చూస్తున్న ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందుతుంది. మొదట నాగచైతన్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్ లాంటి హీరోలతో నటించి మెప్పించింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతితక్కువ సమయంలోనే టాలీవుడ్ బుట్ట బొమ్మగా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇప్పటికైనా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఎస్ మీ గెస్ కరెక్టే.. తనే పూజ హెగ్డే. మొదట్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సంపాదించుకున్నా.. తర్వాత తను నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో అమ్మడికి టాలీవుడ్ మార్కెట్ తగ్గి.. సినిమా అవకాశాలు దూరమయ్యాయి. ఈ క్రమంలో టాలీవుడ్కు దూరమైన పూజ ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయింది. ఇక 2012లో ముస్కిన్ డైరెక్షన్లో వచ్చిన ముగమూడితో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజ.. హీరోయిన్ గాను వెండి తెరకి ఈ సినిమాతోనే పరిచయమైంది. రెండేళ్ల గ్యాప్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక లైలా కోసం సినిమాతో చైతూ సరసన ఆడి పాడింది. తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్కు షిఫ్ట్ మొహంజదారో సినిమాతో హృతిక్ రోషన్ సరసన చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది.
దీంతో మళ్ళీ టాలీవుడ్‌కు వచ్చి.. అల్లు అర్జున్ సరసన అవకాశాన్ని కొట్టేసింది. డీజే సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ అరవింద సమేత లో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత మళ్లీ బన్నీ తోనే అల వైకుంటపురంలో నటించి మరో సక్సెస్ సాధించింది. తర్వాత మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా ప్రతి సినిమాతోనూ సక్సెస్ అందుకుంది. వరుణ్ తేజ్ తో చేసిన గద్దల కొండ గణేష్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో మెల్లమెల్లగా టాలీవుడ్ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో కోలీవుడ్‌లో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది.
మళ్ళీ ప్రభాస్ రాదేశ్యామ్‌లో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్. దీంతో ఒక్కసారిగా పూజ హెగ్డే కు ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. వెంటనే కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు అవకాశాలు దక్కించుకొని అక్కడ కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో కెరీర్ డౌన్ ఫాల్ అయింది. అయితే ఇప్పుడిప్పుడే అమ్మడి కెరీర్ మళ్ళీ పొంజుకుంటుంది. సూర్య 44 లో హీరోయిన్గా అవకాశం దక్కించుకొని నటిస్తుంది. అంతే కాదు విజయ్ దళపతి సరసన తలపతి 69 లోను కనిపించనుంది. వీటితో పాటు తెలుగులో నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతుందని సమాచారం. మొత్తానికి ఎన్ని ప్రాబ్లం ఎదురైనా స్ట్రాంగ్‌గా పూజ ఇండస్ట్రీలో నిలబడి మరోసారి అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ సినిమాల్లో సక్సెస్ అయితే మాత్రం అమ్మడికి మళ్లీ పూర్వ వైభోగం వస్తుంది అనడంలో సందేహం లేదు.