ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఎన్నో దర్గాలకు నిలయంగా మారిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో చాలా పెద్ద దర్గాలు కూడా ఉన్నాయి. ఈ దర్గాల్లో ప్రతి ఏడాది నేషనల్ ముషాయిరా గజాల్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటారు. అలా ఈ ఏడది కూడా 80వ నేషనల్ ముషీయిరా గజాల్ ఈవెంట్ వైభవంగా చేశారు. ఇక ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జన సందోహం హాజరై సందడి చేశారు. కేవలం సామాన్యులే కాదు పాపులర్ సెలబ్రిటీలు కూడా ఇందులో హాజరవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏ.ఆర్.రెహమాన్ లాంటి సెలబ్రిటీస్ ఆ దర్గాను సందర్శించి వెళ్లారు. తాజాగా రామ్ చరణ్ కూడా ఈ దర్గాలో దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దర్గాను సందర్శించిన చరణ్ మాట్లాడుతూ.. ఈ దర్గా 80వ నేషనల్ ముషాయిరా గజాల్ ఈవెంట్ కు నన్ను పిలిచినందుకు చాలా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.
తన కోసం వచ్చిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలంటూ తెలియజేసిన చరణ్. 12 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చా. నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా మగధీర. ఈ సినిమా రిలీజ్ ఒక్కరోజు ముందు ఈ దర్గాకు వచ్చి వెళ్ళా. ఇక్కడ పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నా. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. నాకు మంచి స్టార్డం వచ్చింది. ఈ దర్గాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక నాన్నగారు కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారని..చరణ్ వివరించాడు. కాగా చరన్ – బుచ్చిబాబు కాంబో సినిమాకు.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఆయన నాకు ఈ ఈవెంట్ గురించి వెళ్లడించారు.
కచ్చితంగా ముషాయిరా గజాల్ ఈవెంట్‌కు వస్తానని రెహమాన్‌కు మాటిచ్చా. ఇప్పుడు అయ్యప్ప మాల లో ఉన్నా అయినా ఆయనకిచ్చిన మాట తప్పకూడదని ఇక్కడికి వచ్చా. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అంటూ చరణ్ వెల్లడించారు. రాంచరణ్ తో పాటు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ దర్గాకు వెళ్లారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్ట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే చరణ్ చేసిన పనిపై మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది చరణ్ చేసిన దానిలో తప్పేముంది.. దేవుడు ఎవరైనా ఒకటే అని చెబుతుంటే. మరి కొంతమంది మాత్రం.. అయ్యప్ప మాల లో ఉంటూ దర్గాకు వెళ్లి నమస్కారం చేయడం అసలు సరైన పద్ధతి కాదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.