జగన్ పాపులర్ డైలాగ్ పుష్ప 2లో కాపీ కొట్టారా.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ వీడియో..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అంటే మెగా అభిమానుల్లో సందడి ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చిరు, చరణ్, బన్నీ, ప‌వ‌న్‌.. ఇలా అందరి సినిమాలను మెగా అభిమానులు కలిసికట్టుగా చూసేవారు. ప్రోత్సహించేవారు. కానీ.. ఇటీవల జరిగిన ఓ సంఘటన కారణంగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య వైరం ఏర్పడింది. అల్లు అర్జున్ అభిమానులు, పవన్ అభిమానులు అంటూ ఫ్యాన్స్ మధ్యన బీటలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ రెండు ఫ్యామిలీల అభిమానులు సపరేట్ అయి ఒక‌రినొక‌రు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విభేదాలు ఉంటాయా అంటే దానికి సమాధానం లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇరు హీరోలా అభిమానుల మధ్య పెద్ద చిచు రగిలింది.

Pushpa 2: Tickets to be sold via auction in Hyderabad, other cities

అయితే బన్నీకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ లేకున్నా.. వైసీపీ ఫ్యాన్స్ మాత్రం సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బన్నీ వైసీపీ ఎమ్మెల్యే నంద్యాల శిల్పా రవి ఇంటికి వెళ్లి ఆయనకు సపోర్ట్ గా నిలవడమే కార‌ణం. పవన్ అభిమానులు దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అప్పటినుంచి.. ఇప్పటివరకు ఈ గొడవలు కొనసాగుతూనే ఉన్నా.. మరో పక్కన ఎన్నికల టైం లో తమ పార్టీ ఎమ్మెల్యే కి సపోర్ట్ చేసినందుకు అల్లు అర్జున్‌కు వైసిపి పార్టీ అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో పుష్ప 2 రేంజ్‌లో ప్రమోట్ చేస్తూ సినిమాను మరింత సక్సెస్ చేయడానికి సహాయపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లోని ఓ డైలాగ్ తమ ప్రియతమ నాయకుడు జగన్ ఓ సందర్భంలో మాట్లాడిన పాపులర్ డైలాగ్ అంటూ ఓ ఎడిటెడ్‌ వీడియోని అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Pushpa-2: Pushpa-2 Sets New Record as Biggest Release in..

ఈ ట్రైలర్ లో బన్నీ.. నాకు కావాల్సింది ఏడుకొండల పై ఉన్నా.. ఏడు సముద్రాలు దాటి ఉన్నా.. పోయి తెచ్చుకునేదే ఈ పుష్ప స్టైల్ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ విసురుతాడు. వైసీపీ కార్యకర్తలను ఇటీవల అరెస్ట్ చేసిన సమయంలో.. జగన్ ఓ ప్రెస్ మీట్ లో ఇలాంటి డైలాగే చెప్పాడు. మేము అధికారంలోకి రాగానే.. మా కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు ఏడు సముద్రాల అవతల దాగున్న పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ రెండు డైలాగ్స్ ని క్లబ్ చేసి జగన్‌ని, అల్లు అర్జున్‌ని కలుపుతూ వైసిపి ఫ్యాన్స్ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ పుష్ప 2ను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కాదు.. బయట కూడా పుష్ప 2ని వైసిపి అభిమానులు సపోర్ట్ చేస్తారా.. లేదా.. ఏ రేంజ్ లో సినిమా సక్సెస్ అందుకుంటుందో చూడాలి.