వివాదాల నయనతార డాక్యుమెంటరీ.. మహేష్ కు అంతగా నచ్చేసిందా.. ఏం జరిగిందంటే..?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తన డాక్యుమెంటరీలో కేవలం 3 సెకండ్ల వీడియో వాడినందుకు రూ.10 కోట్లు ఇవ్వాలంటే ధనుష్ నోటీసు పంపించాడని.. అత‌నో నీచుడంటూ సంచలన‌ కామెంట్ చేస్తూ.. ఏకంగా మూడు పేజీలతో ధనుష్ పై చెలరేగింది నయనతార. ఈ క్రమంలోనే నయనతార డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీలో నయనతార చిన్నప్పటి నుంచి తన లైఫ్ లో జరిగిన ప్రతి కీలకమైన సంఘటనని ప్రేమ, పెళ్లి, పిల్లలతో సహా అన్ని విషయాలను షేర్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ డాక్యుమెంటరీ కోసం నయన్‌, ధనుష్ నిర్మించిన చిత్రం నానం రౌడీ దానన్ సినిమాలోని ఓ మూడు సెకండ్లు పూటేజ్‌ను వాడుకున్నారు. దీనికి తను అభ్యంతరం తెలుపుతూ రూ.10 కోట్ల లీగల్ నోటీసు పంపాడు. ఇక ఈ విషయంపై ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీ సోమవారం రిలీజ్ కాగా.. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం హట్‌ టాపిక్‌గా మారింది. మహేష్ బాబు తాజాగా నయన‌తార డాక్యుమెంటరీని చూసినట్లు వెల్లడించారు.

ఇలా ఈ డాక్యుమెంటరీ చూసిన ఆయన.. సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. ఆ డాక్యుమెంటరీ రిలేటెడ్ పోస్టర్‌ల‌ను షేర్ చేసుకున్నాడు. ఏకంగా మూడు లవ ఇమోజీలతో ఈ పోస్టును షేర్ చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా మారింది. వివాదాలలో ఉన్న నయనతార డాక్యుమెంటరీ మహేష్ కు అంతగా నచ్చేసిందా అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు పాపం మహేష్ బాబు సినిమాలు లేక ఖాళీగా కూర్చుని ఇలా డాక్యుమెంటరీలు చూస్తూ రివ్యూస్ ఇస్తున్నాడన్నమాట అంటూ పంచ్‌లు వేస్తున్నారు. ఇక మహేష్ త్వరలోనే జక్కన్న సినిమా షూట్ లో బిజీ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ వచ్చేయడాది జనవరి నుంచి ప్రారంభమవుతుందని టాక్.