టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాట్నాల ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. దీనికి తగ్గట్టుగా టాలీవుడ్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ పై రియాక్ట్ అవుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
పుష్ప 2 ట్రైలర్ చూసిన జక్కన్న ఈ ట్రైలర్ గురించి.. అలాగే సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. పుష్ప.. పార్టీ కోసం ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్‌ను షేర్ చేసుకున్నారు. ఈ విధంగా రాజమౌళి.. ట్రైలర్ గురించి, అలాగే పుష్పా ఇచ్చే పార్టీ గురించి రియాక్ట్ అయిన వెంటనే బన్నీ దీనికి రిప్లై ఇస్తూ థాంక్యూ సర్.. త్వరలోనే మీకు పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నా.. అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రాజమౌళితో పాటు రాంగోపాల్ వర్మ, కిరణ్ అబ్బవరం లాంటి ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఈ ట్రైలర్ పై రియాక్ట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు షేర్ చేసుకున్నారు.
కాగా.. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. ఏవో కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొదట డిసెంబర్ 6 రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను.. తాజాగా మేకర్స్ ఒకరోజు ముందుకు జరిపి డిసెంబర్ 5 కు రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. శ్రీ లీల ఐటమ్ క్వీన్ గా మెరువనుంది. ఇక రిలీజ్‌కు దాదాపు 15 రోజులు ఉండగానే రూ.1000కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ను పూర్తి చేసుకున్న పుష్ప 2 సంచలనం సృష్టించింది.