మగవారి నిజమైన లక్షణాలు ఇవే.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక‌ మహేష్ ప్రస్తుతం జక్కన్న కాంబోలో ఓ పాన్ వరల్డ్ సినిమాను నటించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు నెల‌కొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడు సెట్స్‌ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతుంది.

ఇంకా సినిమా సెట్స్ పైకి రాలేదు సరికదా.. వచ్చేయడానికి జనవరిలో కూడా సెట్స్‌పైకి వస్తుందో లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో మహేష్ మరో సినిమాలో నటించే అవకాశం కూడా లేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సూపర్ స్టార్.. తను పెట్టే ప్రతి పోస్ట్‌తోను ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇవే మగవారి నిజమైన లక్షణాలు అంటూ మహేష్ బాబు చేసిన పోస్ట్ ప్రస్తుతం హ‌ట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.

మహేష్ సోష‌ల్ మీడియా వేదికగా ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు. గౌరవం, సానుభూతి, బలమైన వ్యక్తిత్వం మగవారి నిజమైన లక్షణాలు అంటూ వెల్లడించాడు. సమానత్వం కోసం నిలబడి.. తన చేసే పనుల్లోనూ దయ చూపే వాడే రియల్ మార్డ్ అంటూ మహేష్ బాబు వెల్లడించాడు. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నాడు మీరు కూడా నాతో చేరండి అంటూ మహేష్ బాబు పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం మ‌హేష్ చేసిన ఈ ఇంట్ర‌స్టింగ్ పోస్ట్ తెగ ట్రెండ్ అవుతుంది.