సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేక్షకులు.. ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నయనతార డాక్యుమెంటరీ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని నయనతార బియాండ్ పేయిరీ టేల్స్ టైటిల్ తో రిలీజ్ చేశారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగే ఈ డాక్యుమెంటరీ నయనతార, విగ్నేష్ పెళ్ళైన రెండేళ్ల తర్వాత రిలీజ్ అయింది. అంతేకాదు ఎంతోమంది నటీ నటులు ఆమెతో ఉన్న అనుభవాలను, అనుబంధాలను ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున.. బాస్ సినిమాలో నయనతారతో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.
ఈ డాక్యుమెంటరీ లో నాగ్ నయన్‌తో ఉన్న అనుభవాలను షేర్ చేసుకున్నాడు. ఆ టైంలో ఆమె మరొక రిలేషన్లో ఉందని.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది అంటూ గుర్తు చేసుకున్నాడు. నయనతార డేటింగ్ లో ఉన్న అతని పేరు నాగార్జున చెప్పకపోయినా.. వారి రిలేషన్ కల్లోలంగా ఉండేది అంటూ అభివర్ణించాడు. ఆమె అందంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఆమెలో ఉన్న ఓ రాజసం, ఆత్మీయంగా మాట్లాడే ఆమె మాటలు, నిజాయితీగల నవ్వు అన్ని నాకు నచ్చుతాయి.. ఇద్దరి మధ్య ఇన్సిడెంట్ కనెక్షన్ ఉండేది. అలాంటి వ్యక్తులతోనే నేను స్నేహం చేయాలనుకుంటా. మేము స్విజర్లాండ్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె తన రిలేషన్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది అంటూ వివరించాడు.
ఆమె ఫోన్ రింగ్ అయిందంటే మేమంతా భయపడి పోయే వాళ్ళం.. ఫోన్ మోగితే ఆమె మానసిక స్థితి మారిపోయేది. ఆమెతో రిలేషన్ గురించి మాట్లాడినట్లు కూడా నాకు గుర్తుందంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. నీ లైఫ్ ని ఎందుకు ఇలా చేసుకుంటావు.. నువ్వు చాలా సాధించిన మహిళవి.. నీకు ఇంతా కష్టం అవసరంలేదని నాగార్జున వివరించాడట. అయితే నాగార్జునతో బాస్ సినిమా చేసే సమయం నాటికి నయన్ సీనియర్ హీరో ప్రభుదేవతో నయనతార రిలేషన్ లో ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యన జరుగుతున్న వివాదాల సమయంలో బాస్ సినిమాలో నటించిందట నయన్. అప్పట్లో ఈమె ఎన్నో ఇబ్బందులు పడిందంటూ.. నాగార్జున చెప్పిన మాటల తర్వాతే నయనతార ఆ రిలేషన్కు ఎండ్ కార్డ్ వేసిందని డాక్యుమెంట్రీ చూసిన ఆడియన్సప్ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.