ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన తారక్ మూవీ ఏదో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మల్టీ స్టార‌ర్ సినిమాలను చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆవ‌క్తి చూపుతున్నారు. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు మల్టీ స్టార‌ర్‌ల్లో నటించి తమ సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇద్దరు స్టార్ హీరోస్ ఓ మల్లి స్టార‌ర్ నటిస్తున్నారంటే అభిమానుల్లో ఆ సినిమాపై ఉండే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఇప్పటికే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల‌, మనం, ఆర్ఆర్ఆర్‌ లాంటి మల్టీ స్టారర్ సినిమాలు రూపొంది బ్లాక్ బస్టర్ అయ్యాయి.

Yamadonga - Wikipedia

ఇక ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ లో క‌నిపించిన ప్రేక్షకులు ఎంతో థ్రిల్ అవుతారు. థియేటర్ దద్దరిల్లిపోతాయి. అలాంటి ఒక కాంబినేషన్ గతంలో తెర‌కెక్కింది. ఇంతకీ ఆ కాంబో ఏంటి అనుకుంటున్నారా.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ కాంబో. గతంలో ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించాడట. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తారక్ కూడా ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు.

తాజాగా దేవ‌ర‌తో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి క్రమంలో తారక్ నటించిన ఓ సినిమాలో రెబల్ స్టార్ గెస్ట్ రోల్లో కనిపించాడంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు యమదొంగ. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో.. ప్రభాస్ ఓ చిన్న పాత్రలో కనిపించి మాయమవుతాడు. కానీ.. అది సినిమాలో కాదు టైటిల్ కార్డ్స్ పడే టైంలో. విశ్వామిత్ర ప్రొడక్షన్స్ కోసం టెస్ట్ షూట్‌లో క‌నిపించాడు. అది కూడా మ‌ని గెట‌ప్‌లో.. చాలామంది ఆయ‌న‌ను కనిపెట్టలేరు. అలా తారక్ సినిమాలో ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.