టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాలలో దేశముదురు ఒకటి. అల్లు అర్జున్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. పూరి జగన్నా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. ఆ ఏడాదిలో రిలీజ్ అయ్యిన సినిమాలన్నింటిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సిక మోత్వాన్ని టాలీవుడ్కు పరిచయమైంది. ఇక ఎలాంటి ఇమేజ్ ఉన్న హీరో అయినా.. పూరి జగన్నాథ్ చేతికి చెక్కితే మాస్ ఇమేజ్ ఖాయమని అభిప్రాయాలు ఎప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉంటాయి. దాన్ని అల్లు అర్జున్ విషయంలో నిజం చేసి చూపించాడు పూరి. అయితే ఈ మూవీ ఫస్ట్ ఆప్షన్ బన్నీ కాదట. అక్కినేని హీరో సుమంత్ వద్దకు ఈ స్క్రిప్ట్ వెళ్లిందట.
పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ కలిసి సుమంత్ ను అప్రోచ్ అయ్యి కథను కూడా వినిపించారట. కానీ.. దాన్ని ఆయన రిజెక్ట్ చేశాడు. ఈ కథ నాకు నచ్చలేదు. స్టోరీలో నైతికత లేదు. నేను ఈ సినిమాలో నటించనని చెప్పేసాడట. చాలా కన్విన్స్ చేసిన అస్సలు ఒప్పుకోలేదు. ఇక దీంతో చేసేది ఏమీ లేక కథను బన్నీ దగ్గరకు తీసుకువెళ్లారు. సుమంత్ రిజెక్ట్ చేసిన ఈ కథలో మాస్ ఎలిమెంట్స్ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ బన్ని ని సినిమాలో వేరే లెవెల్లో చూపించాడు. 2007 జనవరి 12 రిలీజ్ అనే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టింది. ఇండస్ట్రీలో బన్నీకి తిరుగులేని క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమా స్టోరీని సుమంత్ రిజెక్ట్ చేసే టయానికి కేవలం ఆయనకు ఫస్ట్ వెర్షన్ మాత్రమే వినిపించారట.
స్క్రిప్ట్ ఫైనల్ కాలేదట. జస్ట్ ఫస్ట్ వర్షన్‌లో సన్యాసిగా ఉన్న హీరోయిన్ దగ్గరకు వెళ్లి ఆమెను ప్రేమించాలి, ప్రతిసారి ఆమెను డిస్టర్బ్ చేయాలి అనే ఎలిమెంట్స్ సుమంత్‌కు చెప్పడంతో.. సుమంత్ రిజెక్ట్ చేశాడట. కానీ.. ఈ సినిమా చేసి ఉంటే సుమంత్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచి ఉండేది. మాస్ హీరోగా ఆయనకు ఇమేజ్ క్రియేట్ అయ్యేది. సుమంత్ కు కరెక్ట్ గా ఈ సినిమా పడి ఉంటే.. ఇమేజ్, మార్కెట్ మరింతగా పెరిగి హీరోగా నెక్స్ట్ స్టెప్ తీసుకునేవాడు. ఓ రకంగా స్టార్ హీరో రేంజ్ కు సుమంత్ ఎదిగి ఉండేవాడు. కానీ.. చేతులారా ఆయన ఆ సినిమాను రిజెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు దక్కక సతమతమవుతున్న పరిస్థితి. ఇటీవల సీతారామం, సార్ సినిమాల్లో సుమంత్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలా దేశముదురుని రిజెక్ట్ చేసి స్టార్ హీరో కావాల్సినవాడు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయాడు.