సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోలుగా ఎదగడం అంటే అది సాధారణ విషయం కాదు. దాని వెనక ఎంతో శ్రమ, కృషి ఉంటుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేజెక్కించుకుని ప్రేక్షకులను, దర్శకుల్ని మెప్పించాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగి టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో నిఖిల్ కూడా ఒకరు. శేఖర్ కముల డైరెక్షన్‌లో తెరకెక్కిన హ్యాపీ డేస్ తో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరయినా నిఖిల్.. ఈ సినిమా తర్వాత.. బ్యాక్ టూ బ్యాక్ సినిమా ఆఫర్లను అందుకుంటూ మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.
కార్తికేయ 2 తో పాన్ ఇండియన్ స్టార్ట్ గా మారిపోయిన నిఖిల్.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నాడు. అయితే ఈ యంగ్ హీరో హ్యాపీ డేస్ సినిమా కంటే ముందు వెండితెరపై కనిపిస్తే చాలు అనే ఆలోచనతో.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సంబరం, హైదరాబాద్ నవాబ్ సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించాడు. తర్వాత సీరియల్లో నటించే అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఈటీవీలో టెలికాస్ట్ అయినా చదరంగం సీరియల్లో కీలక పాత్రలో మెరిసాడు. 1998లో బచ్చిన ఈ సీరియల్లో.. నిఖిల్ తో పాటు చిన్న, రాజీవ్ కనకాల లాంటివారు నటించారు. ఈ సీరియల్ లో కంప్లీట్ యంగ్ లుక్ లో నిఖిల్ ఆకట్టుకుంటాడు.
అప్పట్లోనే ఈ సీరియల్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నిఖిల్ కెరీర్‌లో నటించిన ఏకైక సీరియల్ కూడా అదే కావడం విశేషం. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు తో మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. హిస్టారియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి డైరెక్టర్గా.. టాలీవుడ్కు ఎంట్రీ ఇవనున్నాడు. ఇక ఈ మూవీలో నభానటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఇక నిఖిల్ నటించినున్న మరో మూవీ ది ఇండియా హౌస్. ఈ సినిమాకు రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. స్వతంత్ర సంగ్రామం నాటి సంఘటనను పీరియాడికల్ డ్రామాగా రూపొందిస్తున్నారు.