కథను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు.. చిరంజీవి పై బాబీ షాకింగ్ కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన చిరు.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక ఇప్పటికి చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు ఎగబడి మరీ చూస్తారు. అయితే గత కొంతకాలంగా చిరంజీవి నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. అయన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు.

Chiranjeevi, Bobby join hands for Chiru 154. Mega update on actor's  birthday - India Today

ఇక చిరు నుంచి చివరిగా తెర‌కెక్కిన ఆశ్చర్య సినిమా ఎలాంటి డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబి గతంలో చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య‌తో డాకు మహారాజ్ సినిమాను చేస్తున్నాడు. బాబి దాదాపు ఈ సినిమా షూట్ పూర్తి చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే రీసెంట్గా డాకు మహారాజు టీజ‌ర్ రిలీజై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు ఏర్ప‌డాయి. ఇది ఇలా ఉండగా బాబీ ఇటీవ‌ల చిరంజీవి, బాలకృష్ణ వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ చేసిన‌ కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి.

Balakrishna-Bobby: సంక్రాంతికి కాదు.. ఆ సెంటిమెంట్‌ రోజే సినిమా విడుదల! -  NTV Telugu

బాబి మాట్లాడుతూ.. చిరు గారు ఏదైనా స్టోరీ చెబితే దాని గురించి ప్రతిసారి అడుగుతూ ఉంటారని.. ముందే డైలాగ్స్ పేపర్ కూడా ఇవ్వమంటారని.. ప్రతి విషయంలోనూ చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారంటూ చెప్పుకొచ్చాడు. అదే బాలయ్య ఒకసారి సినిమా కథ చెప్పిన తర్వాత ఆయనకు ఓకే అనిపిస్తే డైరెక్టర్ ను మారు ప్రశ్నించారు. సెట్స్‌కు వచ్చిన తర్వాత ఆ టైంలో డైరెక్టర్ ఏది చెబితే అదే ఫాలో అవుతాడు. డైరెక్టర్ ను గుడ్డిగా నమ్మి పనిచేస్తారు అంటూ చెప్పుకోచాడు. ప్రస్తుతం బాబి చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో.. చిరును యాంటీ మెగా ఫాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. బాబి ఇన్ డైరెక్ట్గా చిరంజీవి కథను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడని చెప్పాడంటూ కామెంట్లు చేస్తున్నారు.