చరణ్ పై విమర్శలకు.. చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చిన ఉపాసన..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా కడప పెద్ద దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ 80వ‌ నేషనల్ మోసాయిరా గజాల్‌ ఈవెంట్లో పాల్గొనే సందడి చేసిన చరణ్.. దర్గా సందర్శించుకున్నాడు. అయితే అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లి దర్శనం చేసుకోవడంతో పలువురు విమర్శలు గుంపుమనిపించారు. కొందరైతే అందులో తప్పేముందని.. చరణ్ కు సపోర్ట్ చేసినా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాంచరణ్ భార్య‌ ఉపాసన సోషల్ మీడియా వేదికగా అసహనాన్ని వ్యక్తం చేసింది.

రామ్‌చ‌రణ్ పై విమర్శలు కురిపిస్తున్న వారిపై మండిపడింది. తన ఇన్స్టాలో చరణ్ దర్గాలో దర్శనం చేసుకుంటున్న ఫోటో షేర్ చేస్తూ.. సారే జహాసే అచ్చా.. హిందుస్థాన్ హమారా అనే గీతాన్ని జత చేసింది. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తాడంటూ.. దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుందంటూ రాసుకొచ్చింది. భక్తి ఎవరిని చిన్నాభిన్నం చేయకూడదని.. మేము అన్ని మతాలను గౌరవిస్తామంటూ వెల్లడించిన ఉపాసన.. ఐక్యతలోనే మ‌న బ‌లం ఉంటుంద‌ని వెల్ల‌డించింది. వ‌న్ నేషన్, వన్ స్పిరిట్ అంటూ ఆమె రాసుకొచ్చింది.

Upasana Konidela Defends Ram Charan's Dargah Visit: 'Faith Unites, Never Divides'

ఇక దర్గాకు రామ్ చరణ్‌తో పాటు.. డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సందర్శించారు. త్వరలోనే వీరిద్దరూ కలిసి కొత్త సినిమా చేయనన్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే.. సెంటిమెంట్‌గా వారు అక్కడికి వెళ్లారు. గతంలో మగధీర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుని చరణ్‌కు తిరుగులేని ఇమేజ్‌ని క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని చ‌ర‌ణ్ ప్ర‌స్తావిస్తూ.. మ‌గ‌ధీర రిలీజ్‌కు ముందు రోజు ఇక్క‌డ‌కు వ‌చ్చి సంద‌ర్వించా.. ఆ మూవీ సూప‌ర్ హిట్ అయ్యింది. ఎప్పటికీ ఈ ద‌ర్గాకు రుణపడి పోతూ ఉంటా అంటూ చ‌ర‌ణ్‌ చెప్పుకొచ్చాడు. ఇక మరికొద్ది రోజుల్లో.. రామ్ చరణ్ నుంచి శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన గేమ్ ఛేంజ‌ర్‌ ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చరణ్.. మగధీర సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.