టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 10న సెట్స్ పైకి రానుంది. ఇక చరణ్ ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఉప్పెన ఫేమ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది.
ఇక గేమ్ ఛేంజర్ షూట్ పూర్తి కాగానే కొంత గ్యాప్ తో చరణ్ ఈ సినిమా సెట్స్‌లో అడుగు పెడతాడంటూ వార్తలు వినిపించాయి. ఇక RC16 రన్నింగ్ టైటిల్ తో పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా.. షూట్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా షూట్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ నెటింట వైరల్ గా మారుతుంది. ఇంకా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌కు చాలా సమయం ఉంది. ఈ క్రమంలోనే RC16 షూట్‌ను కూడా ప్రారంభించాలని చరణ్ భావిస్తున్నాడట.
ఇందులో భాగంగా ఈ వారంలోనే మైసూర్‌లో షూటింగ్ ప్రారంభించనున్నారని టాక్. రామ్ చరణ్‌తో పాటు.. ప్రధాన తారాగణం అంతా అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చేయనున్నారట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఇప్పటివరకు చూడని సరికొత్త పంథాలో ఉంటుందని తెలుస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా రూపొందిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్ సంస్థ రూపొందిస్తుంది.