రాకేష్ వర్రే ” జితేందర్ రెడ్డి ” రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..

సినీ, రాజకీయ నాయకుల బయోపిక్ లో తెలుగులోపాటు ఎన్నో భాషల్లో తర్కెక్కుతూనే ఉంటాయి. దేశంలో స్వార్థం లేకుండా పనిచేసి.. ప్రజల మనను పొందిన ఎంతోమంది నాయకుల బయోపిక్లు ఇప్పటివరకు తెరపై కనిపించాయి. అలాంటి స్వయంసేవకుడు కథే జితేందర్ రెడ్డి. విరించి వర్మ డైరెక్షన్లో తరికెక్కిన ఈ సినిమాలో.. రాకేష్ వ‌ర్రే హీరోగా న‌టించాడు. వైశాలి రాజ్, ప్రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవికిషన్ కీలకపాత్రలు పోషించారు. ముద్ర‌గంటి రవీందర్ రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ప్రేక్షకులను రాకేష్ వర్రె.. జితేంద‌ర్ రెడ్డిగా మెప్పించాడా.. లేదా.. చూద్దాం.

Jithender Reddy (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

కథ
1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలో జరిగిన ఓ యదార్ధ గాధ ఆధారంగా సినిమా రూపొందింది. జితేందర్ రెడ్డి ఫ్యామిలీ సభ్యులు.. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు. ఇక ఈ ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఇష్టపడతాడు. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అసలు జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రె) ఎవరు.. అతని చైల్డ్హుడ్ ఎలా గడిచింది.. నక్సల్స్ ని ఆయన ఎలా ఎదుర్కొన‌నాడు.. కాలేజ్ డేస్ లో ఏబీవీపీ నాయకుడిగా జితేందర్ పోరాటాలు.. ఆయనపై ఆర్ఎస్ఎస్ నేత గోపన్న (సుబ్బరాజు) ప్రభావం ఎంత ఉంది.. ఇక జితేందర్‌ను చంపడానికి నక్సల్స్ ప్లాన్ ఏంటి.. జితేందర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత జగిత్యాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి.. కాలేజ్ స్నేహితురాలు లాయర్ శారద (రియా సుమన్) ఆయనకు ఎలాంటి సపోర్ట్ అందించింది. చివరకు జితేందర్ ఎలా మరణించాడో అనేదే కథ.

విశ్లేషణ
తెలంగాణ జగిత్యాలలో పుట్టిన జితేందర్ రెడ్డి.. 1980లో నక్సలైట్లు, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాడు. వామపక్ష ఉద్యమాలు ఉదృతంగా ఉన్న టైంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన జితేందర్‌ బయోపిక్ ఇది. జితేంద‌ర్‌ గురించి జగిత్యాల ప్రజలకు పరిచయాలు అవసరం లేదు. నక్సల్స్ పై ఆయన చేసిన పోరాటం.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఇక కరీంనగర్ జిల్లా లో తప్ప.. జితేందర్ రెడ్డి ఎవరు.. ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో.. చాలామందికి తెలిసి ఉండదు. జితేందర్ రెడ్డి ఓ ఏబీవీపీ నాయకుడిగా నక్సల్స్ పై పోరాడి మరణించిన వ్యక్తిగా మాత్రమే చాలామందికి తెలుసు. అయితే ఈ సినిమాల్లో ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. ఇక కథలో వాస్తవం ఎంతవరకు ఉన్నా.. తాను అనుకున్న కథను అనుకున్నట్లుగా ఆడియన్స్ కు చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. జితేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి ఆయన చనిపోయే సమయం వరకు.. జరిగిన ఎన్నో కీలక ఘటనలు తెరపై కనిపించాయి.

Jitender Reddy: 1980's నిజంగా జ‌రిగిన రాజ‌కీయాల నేప‌థ్యంలో 'జితేందర్  రెడ్డి'.. ట్రైల‌ర్‌కు అనూహ్య స్పందన | Virinchi Varma Jitender Reddy Movie  Trailer Getting good responce ktr

ఎన్నో విషయాలను సేకరించి వాటిని కాస్త డ్రమటైజ్ చేసి డైరెక్టర్ చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జితేందర్ కు దైవ భక్తి ఎక్కువ అనే విషయాన్ని ఆడియన్స్ కు సినిమా మొదట్లోనే క్లారిటీగా వివరించాడు. 18 ఏళ్ల యువ‌కుడు ఎన్కౌంటర్‌తో సినిమాపై మరింత ఆసక్తి కలుగుతుంది. జితేందర్ రెడ్డి బాల్యంతో పాటు.. ఆయన స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన తీరును కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. నక్సల్స్‌కు జితేందర్ టార్గెట్ అయిన విధానం.. వారితో పోరాడిన విధానం చూపించారు. అయితే కొన్ని సీన్స్ మరీ నాటకీయంగా అనిపిస్తాయి. అక్కడక్కడ లాగ్ అనే ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. ఆయ‌న‌ పోరాటం గుసుబంప్స్‌ తెప్పించే విధంగా చూపించారు. ఇక అప్పటి సీఎంను కలిసి నక్సల్స్ పై చేసే ఫిర్యాదు సీన్స్, ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్ ఆడియ‌న్స్‌ను ఆకట్టుకుంటాయి. దేశంలో పాతుకుపోయిన లీఫ్ లివర్ ఎకో సిస్టం కారణంగా కామ్రేడ్‌ల‌ను హీరోలుగా చూపించారు.

కానీ.. ఇటీవల కాలంలో వచ్చే సినిమాల్లో నెక్సల్స్‌ చీకటి కోణాలు కూడా ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటి తరహా కథలు తర్కెక్కించాలంటే లోతైన ఆలోచన అవసరం. కథను నాచురల్‌గా చూపించాలి.. అంతకంటే ఎక్కువగా ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా తిరకేక్కించాలి. ఇదంతా జరగాలంటే మంచి ప్రణాళిక.. అలాగే సినిమా చేయడానికి గట్స్ కూడా కావాలి. ఈ విషయంలో దర్శక, నిర్మాతలు సాహసం చేశారనే చెప్పవచ్చు. జితేంద‌ర్ రెడ్డి చిన్నప్పటి నుంచి సమాజం పట్ల ఉన్న అంకితభావం.. సమాజానికి ఏదో చేయాలనే తపన స్క్రీన్ పై చూపించారు. కాలేజ్ రాజకీయాల్లో అప్పట్లో వివిధ సంస్థలకు బలంగా నాటుకుపోయిన పిడిఎస్‌కు పోటీగా ఏబీవీపీ ఎలా నిలబడింది అనే విషయం తెరపై ఆవిష్కరించారు. కాలేజ్ స్టూడెంట్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదగడం.. పోలీస్ వ్యవస్థకు పోటీగా సమాజంలో నక్సలైట్లు చేసే అక్రమాలకు ఎదురొడ్డి నిలబడడం.. లాంటి ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

Jithender Reddy': 'A aa E ee U uu' is a campus song with a purpose

కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా సనాతన ధర్మం గొప్పతనం గురించి సినిమాలో బాగా చూపించారు. మాటలు ఆకట్టుకుంటాయి. అయితే సినిమా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్న సమయంలో పాటలు కాస్త ఇబ్బంది కల్పించినట్లు అనిపిస్తుంది. చివర్లో నక్సలైట్స్ చేతిలో జితేందర్ రెడ్డి చనిపోయినప్పుడు.. స్వయం సేవకులను గుర్తు చేస్తూ వచ్చే పాట ఆడియన్స్‌తో కంటతడి పెట్టేస్తోంది. క్లైమాక్స్ ఎమోషనల్ గా ముగిసింది.

నటీనటీల పర్ఫామెన్స్
జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రె ఆకట్టుకున్నాడు. నటనతో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన స్టైల్ తో మెప్పించాడు. నక్సలైట్ గా చత్రపతి ఇమిడిపోయాడు. ఇక రియా సుమన్ పాత్ర నడివి తక్కువే అయినా లాయర్ గా ప్రేక్షకులను మెప్పించింది. ఇక జితేందర్ రెడ్డి పిఏ పాత్రలో రవి ప్రకాష్ ఆకట్టుకున్నాడు.

Jithender Reddy Release Date Announcement Promo | Rakesh Varre | Virinchi  Varma | TFPC - YouTube

టెక్నికల్ గా
1980 నాటి ఆర్ట్ వర్క్, బ్యాక్గ్రౌండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ ఎక్కడో కాస్త తడబడింది. ఎడిటింగ్ యావరేజ్. నిర్మాణ విలువలు గొప్ప‌గా తెలుస్తున్నాయి. డైరెక్షన్ విషయంలో పేరు పెట్టే అవసరం లేదు. ఈ సినిమాతో విరించి వర్మ మంచి మార్కులు కొట్టేశాడు. దర్శకుడు తన చెప్పాలనుకున్నది సూటిగా చెప్పినా.. కొన్నిచోట్ల నాటకియ‌త కనిపిస్తుంది. అవి ఓవర్ డోస్ అయినా భావన వస్తుంది.

చివరిగా:
ఓ పక్క స్వయం సేవకుడి పోరాటం.. మరోపక్క కామ్రేడ్ చీకటి కోణం.. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

రేటింగ్:3/5