టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్ తో రొమ్యాన్స్ చేసిన చిరుకు కెరీర్ మొదట్లో ఎంతో కలిసి వచ్చిన హీరోయిన్ మాత్రం రాధిక అనడంలో అతిశయోక్తి లేదు. వీళ్ళ కాంబోలో 16 సినిమాలు తరికెక్కి దాదాపు అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అల వీరిద్దరి మధ్యన మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఇప్పటికి రాధిక తన ఫేవరెట్ హీరో చిరు అంటూ ఎన్నో సందర్భాల్లో వెల్లడించింది. అలాగే చిరుకి కూడా రాధిక అంటే ఎంతో అభిమానం. ఆన్ స్క్రీన్ పై వీళ్ళిద్దరికీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో రియల్ లైఫ్ లో కూడా అంతే సన్నిహితంగా ఉంటారు.
అలాంటిది వీరిద్దరి మధ్య బాండింగ్ కు ఉదాహరణగా ఒక మంచి సంఘటన కూడా జరిగిందట. ఈ సంఘటనను రాధిక.. చిరంజీవితో కలిసి ఓ స్టేజ్ పై చెప్పుకొచ్చింది. చిరంజీవి, రాధిక కలిసి అభిలాష సినిమాలో నటించి మెప్పించారు. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తరికేక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాలో సందేపొద్దులకాడ సాంగ్ ఇప్పటికీ ఎవరు గ్రీన్. ఎస్పీ బాలసుబ్రమణ్యం, జానకి కలిసి ఆలపించిన పాట.. వెనుక పెద్ద స్టోరీ నేను నడిచిందట. ఇప్పుడు ఓ సాంగ్ షూట్ చేయాలంటే.. కచ్చితంగా కొరియోగ్రాఫర్, అసిస్టెంట్, రిహార్సేల్స్ ఇలా ఎంతో హంగామా ఉంటుంది.
కానీ అప్పట్లో కొరియోగ్రాఫర్లు ఎక్కువగా కనిపించేవారు కాదు. అన్ని పనులు వెంటవెంటనే జరిగిపోయేవి. కొన్నిసార్లు కొరియోగ్రాఫర్లు లేని సందర్భాలు కూడా ఉండేవి. అలా సందెపొద్దులకాడ సాంగ్ షూటింగ్ టైంలో కొరియోగ్రాఫర్ అందుబాటులో లేకపోవడంతో.. మనమే కొరియోగ్రఫీ చేసుకొని షూటింగ్ పూర్తి చేద్దామని చిరంజీవి.. రాధికతో చెప్పారట. అలా చిరు, రాధికనే ఓన్ కొరియోగ్రఫీ చేసుకొని షూట్ ను పూర్తి చేసారట. ఈ విషయాన్ని రాధిక చెప్పుకొచ్చింది. వీరిద్దరూ ఓన్ గా కొరియోగ్రఫీ చేసుకొని ఒక్క పూటలో ఆ సాంగ్ ఫినిష్ చేశారట. ఇక చిరంజీవి మాట్లాడుతూ.. నాకు రాధికకు సింక్ చాలా బాగా కుదిరింది దీంతోనే అదంతా సాధ్యమైంది అంటూ చెప్పుకొచ్చాడు. సాంగ్ ఇంత బాగా వర్కౌట్ కావడానికి రాధిక, చిరు కెమిస్ట్రీ కూడా ఓ కారణం. వీరిద్దరూ స్టెప్‌లు ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేశాయి.