క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి.. 600 కోట్ల వరకు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ సక్సెస్ సీక్రెట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి.. ఒకటి, రెండు సినిమాల్లో సక్సెస్ అయితేనే ఎంతో గర్వంతో తమను మించిన వారు లేరంటే ఫీల్ అయ్యే వారు చాలామంది ఉన్నారు. కానీ.. వాళ్ళందరి కంటే ఎంతో భిన్నంగా నాగ్ అశ్విన్ తన మార్పును క్రియేట్ చేసుకున్నాడు. ప్రభాస్ లాంటి పని ఇండియన్ స్టార్ హీరో తో రూ.600 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు తరికెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టి రికార్డ్ క్రియేట్ చేసినా.. ఇప్పటికి ఆయన సింప్లిసిటీకి ఆడియన్స్ ఆశ్చర్యపోతూనే ఉంటారు. అసలు కల్కి సినిమా దర్శకుడేనా.. అంత భారీ బడ్జెట్ సినిమాతో సక్సెస్ అందుకున్న కూడా ఇంత సింపుల్ లైఫ్ని లీడ్ చేయ‌డం ఎలా సాధ్యమవుతుంది అంటూ ఫిదా అవుతారు. అయితే మొదటి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన నాగ్ అశ్విన్ రూ.4 వేల రెమ్యూనరేషన్ నుంచి రూ.600 కోట్ల సినిమాతీసే స్టేజ్‌కు ఎలా ఎదిగాడో ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Is that Nag Ashwin in Leader? : r/tollywood

నాగ్ అశ్విన్‌ పుట్టింది ,పెరిగింది అంత తెలంగాణలోనే. ఆయ‌న‌ తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్స్ కావడంతో కొడుకుని కూడా డాక్టర్ చేయాలని ఎంతో అరటపడ్డారట‌. కానీ ఆయనకు చదువుపై ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీ లోకి రావాలనుకునేవారు. అయితే తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి కాస్త బాధపడిన.. అశ్విన్ నిర్ణయానికి మాత్రం ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఈ క్రమంలోనే మణిపాల్ మల్టీ మీడియాలో చేరి ఎడిటింగ్ నేర్చుకున్నాడు. దీంతో మీడియా రంగంలోకి అడుగుపెడతాడని పేరెంట్స్ భావించారట. కానీ.. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కావాలనుకున్నాడని తెలిసి అశ్విన్ తల్లి శేఖర్ కమ్ములను కలిసి అవకాశాన్ని అడిగారు.

శేఖర్ కమ్ముల తను నెక్స్ట్ సినిమాకు ఆయనను అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకుంటానని చెప్పి పంపించేశారు. ఆ టైంలో ఎన్నో కథలను రాసుకున్న అశ్విన్.. దృశ్య రూపం తీసుకురావాలని ఆరాటపడేవాడట. అదే టైంలో శేఖర్ కమ్ముల లీడర్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక రానా, అశ్విన్ క్లాస్మేట్స్ కావడం గమనార్హం. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించే టైంలో నాగ్ అశ్విన్‌ ట్రైలర్ కట్ శేఖర్ కమ్మలకు నచ్చడంతో.. అదే ట్రైలర్ రిలీజ్ చేశారు. అలా ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసిన టైంలో రూ.4 వేల‌ రెమ్యూనరేషన్ అందుకున్న అశ్విన్.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అలా మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూనే మెల్లమెల్లగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ కు వచ్చాడు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న క్రమంలోనే చిన్న చిన్న పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించాడు.

Who is Project K director Nag Ashwin? - The Statesman

అశ్విన్ రాసుకున్న కథలో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ కూడా ఒకటి. ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కోసం ఎంతో శ్ర‌మించిన నాగ్ అశ్విన్ స‌క్స‌స్ అయ్యాడు. త‌న మూవీ ప్రొడ్యూస్ చేయ‌డానికి అశ్విని దత్త్ ఇద్దరు కుమార్తెలు ముందుకు వచ్చారు. అలా రిలీజ్ అయిన ఎవడే సుబ్రహ్మణ్యం మంచి సక్సెస్ సాధించింది. అశ్విన్ కు డైరెక్టర్ గా మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. అప్ప‌టినుంచి అయ్యాన స‌క్స‌స్ ట్రాక్‌లో నే ఉన్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత సావిత్రి బయోపిక్ మహానటి సినిమాను తర్కెక్కించి మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్. ఒక్కసారిగా అశ్విన్‌ పేరు మారు మోగిపోయింది. నేషనల్ అవార్డ్‌ కూడా దక్కించుకున్నాడు.

తర్వాత క‌ల్కి 2898 ఏడి వ‌చ్చింది. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో.. ఎంత సంచలనం సృష్టించిందో.. అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాను తెర‌కెక్కించే క్రమంలో ఓ పాన్‌ ఇండియన్ హీరోని.. అశ్విన్ మెయింటెన్ చేయగలడా.. ఆయనతో సినిమా సక్సెస్ కొట్టగలడా అని ఎనో సందేహాలు వ్యక్తం చేస్తారట. రూ. 600 కోట్ల బడ్జెట్ తో సినిమా అవసరమా అంటూ ఎగతాళిగా కూడా మాట్లాడారట. కానీ అశ్విన్ పట్టుదలతో కల్కి తీసి బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్నాడు. అలా కెరీర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రూ.4వేల‌కు ప‌నిచేపిన‌ ఆయన ఇప్పుడు రూ.600 కోట్ల బడ్జెట్ సినిమాను తీసే స్టేజ్ కు ఎదగాడు.