రాజ‌మౌళిని న‌టుడిని చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రంటే… టాప్ సీక్రెట్ రివీల్‌..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తన దర్శకత్వంతో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రాజమౌళి నటుడుగాను పలు సినిమాల్లో మెరిశారు. అయితే రాజమౌళిని మొదట నటుడిగా పరిచయం చేసింది ఒక స్టార్‌ హీరో అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విరించి వర్మ స్వ‌యంగా ఇవ‌రించాడు. రాజమౌళిని మొదట నటుడిగా పరిచయం చేసింది నానినే అంటూ చెప్పుకొచ్చాడు. 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విరించి ఫస్ట్ సినిమాతోనే భారీ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు.

Virinchi Varma – TOLLYWOOD CREW

అందరి హీరోల దృష్టిలో పడ్డాడు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్గా నటించిన.. రాజ్ తరుణ్, అవికా కూడా మంచి ఇమేజ్ వచ్చింది. బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ సినిమాను చూసి అప్పట్లో హీరోలంతా ఆశ్చర్యపోయారట. కొత్త దర్శకుడు తీసిన సినిమానా ఇది అని షాక్ అయ్యార‌ట. ఈ సినిమా రిజ‌ల్ట్ తర్వాత విరించి వర్మ పనితనానికి ఫిదా అయిన‌ నాని ఆయనతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మూవీ మరేదో కాదు మజ్ను. అను ఇమ్మాన్యుయేల్, రియా సుమన్ హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాలో నాని నటించినందుకు ఎంతో ఆసక్తి చూపించాడు. ఇక ఈ సినిమా కూడా అప్పట్లో రిలీజ్ అయి బడ్జెట్ కు రెట్టింపు కలెక్షన్లను రాబట్టి మంచి పేరు సంపాదించుకుంది.

SS Rajamouli & Nani Comedy Scene | Nani Majnu Malayalam Movie Scenes | 2018  Scenes - YouTube

అయితే మొదట ఈ సినిమాలో నానిని రచయితగా చూపించాలని డైరెక్టర్ భావించాడట. కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చూపిస్తే బాగుంటుందని నాని సజెస్ట్ చేయడంతో పాత్రను దానికి తగ్గట్టుగా మార్చారు. ఎవరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నట్లు చూపించాలో వీరించికి అర్థం కాలేదట. అప్పుడు నానినే.. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నట్లు చూపించండి అంటూ సజెస్ట్ చేసాడట. దానికి విరంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత నాని నే రాజమౌళిని రిక్వెస్ట్ చేసి మరి సినిమాల్లో నటించడానికి ఒకే చెప్పించారట. అలా జక్కన్న.. నాని కోరడంతో మజ్ను సినిమాలో కనిపించి మెప్పించాడు. ఆయన కనిపించే సీన్స్ ఈ సినిమాలో చాలా ఆకట్టుకుంటాయి.