పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరిగా కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్.. దీనికంటే ముందు సల్లర్ సినిమాతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. భారీ బడ్జెట్‌తో హెంబాలే ఫిల్మ్‌స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.700 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టి ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.
ఇందులో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించారు. ఇలాంటి క్రమంలో ప్రభాస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నహెంబాలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రభాస్ సలార్ 2 త్వరలో సెర్చ్ పైకి రానుందట. అంతేకాదు రెబల్ స్టార్‌తో ఈ బ్యానర్ పై మరో రెండు ప్రాజెక్టులను తెరకెక్కించనుందని.. ఈ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రభాస్‌తో 2026, 2027, 2028 సంవత్సరాలలో ఈ మూడు సినిమాలను రిలీజ్ చేస్తామంటూ ప్రొడక్షన్ హౌస్ వాళ్లు స్వయంగా ప్రకటించడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హెంబాలే ఫిల్మ్‌స్ బ్యానర్ షేర్ చేసుకుంది.
ఈ లెక్కన డార్లింగ్ తో హెంబాలేకి భారీ డీల్ కుదిరినట్టే. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్.. ఏకంగా మూడు సినిమాలతో రూ.450 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ బడా బ్యానర్‌పై రాబోయే మూడు సినిమాల కోసం ప్రభాస్ బిగ్ డీల్ ఫిక్స్ చేసుకున్నాడట. ఇక ఇప్పటికే ప్రభాస్ ది రాజసాబ్, అలాగే హనూ రాఘవపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ తోను ఆయన కనిపించనున్నారు. వీటితో పాటు సలార్ 2 కూడా పెండింగ్లో ఉంది. అయితే ఇవే కాకుండా మరో రెండు ప్రాజెక్టులకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలియడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.