టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన రీతిలో సినిమాలను తెరకెక్కిస్తూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులుగా ఆకట్టుకుంటున్న ఈయన.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈయన నుంచి ఓ పాన్ వరల్డ్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ తెచ్చుకోవాలని తపనతో ఉన్నాడట రాజమౌళి.
ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని ప్లాన్లో ఉన్న జక్కన్న కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటుకోవడానికి ఎంతో కష్టపడుతుంటే.. మరో పక్కన మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా తన ఇమేజ్ను పాన్ వరల్డ్ రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జక్కన – మహేష్ కాంబో మూవీ శివరాత్రి నుంచి షూట్ ను ప్రారంభించనుందట. ప్రస్తుతం జక్కన్న – మహేష్ కాంబో సినిమాకు స్టార్టింగ్ ట్రబుల్ ఏర్పడుతుందట. దీంతో ఎప్పుడు సినిమా ప్రారంభమవుతుందనే దానిపై మాత్రం రాజమౌళి అనౌన్స్ చేసే వరకు క్లారిటీ రాదు. ఇక రాజమౌళి తన ప్రయోగంతో ఈసారి పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటుకుంటాడా.. లేదా.. టాలీవుడ్ స్థాయిని మరింతగా పెంచుతాడో లేదో చూడాలి.