సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. సిటాడెల్.. హనీబన్నీ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత.. మూవీస్ లో ఫిమేల్ పాత్రల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇటీవల కాలంలో వస్తున్న దాదాపు అన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్ర నడివి చాలా తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆడియన్స్ కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమాల్లో హీరోయిన్ పాత్రల గురించి సమంత చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.
సమంత మాట్లాడుతూ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.. మహిళలకు గుర్తింపు వచ్చేలా చేయడం నటిగా నా బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. ప్రేక్షకులు అన్ని విషయాలను అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే ఏం చేసినా మనం బాధ్యతాయుతంగా ఉండాలి. నేను ఓ విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానంటే.. దానికి పూర్తి బాధ్యత నాదే. అందుకే పాత్రలను ఎంచుకునే విషయంలోనూ ఎన్నో సార్లు ఆలోచించి అడుగులు వేస్తా. ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్లకు కూడా న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని నేను భావిస్తున్న. సినిమాల్లో కూడా రెండు మూడు సన్నివేశాలకి పరిమితమయ్యే పాత్రలకు.. అది ఎంత ప్రాజెక్ట్ అయినా.. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా.. దూరంగానే ఉంటా. అలాంటి పాత్రలో అసలు నటించనంటూ చెప్పుకొచ్చింది.
అలాగే నేను చేసే ప్రకటనల విషయంలోనూ ఎంతో ఆలోచిస్తానని వెల్లడించింది. నాకు సిటాడెల్లో నటించడం చాలా పెద్ద సవాల్. ఈ సినిమాలో హీరోకి గట్టి పోటీ ఇచ్చేలా.. యాక్షన్స్ సన్నివేశాల్లో నటించా. కానీ.. ఇలాంటి అవకాశాలు చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. వాటికోసం హీరోయిన్లు కూడా ఎంతగానో ఎదురుచూస్తారు. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిలో నేను కొన్ని సినిమాలను మాత్రమే ఎంచుకుంటా. నాకు వచ్చిన ఆఫర్లకు నేను చేసిన సినిమాలకు మధ్య చాలా తేడా ఉంటుందంటూ సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో.. సమంత ఆలోచనలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయని.. సినిమాల విషయంలో ఆమె మరింత బాధ్యతగా ఉంటుందంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.