‘ కన్నప్ప ‘ నుంచి అదిరిపోయే పిక్ లీక్.. ప్రభాస్ లుక్ కు ఫిదా అవ్వాల్సిందే..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అర‌డ‌జ‌నుకే పైగా సినిమాల‌తో బిజీ లైనప్‌లో క్షణం తీరకలేకుండా గడుపుతున్న ప్రభాస్.. ఎన్నో భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. అయితే హీరోగానే కాదు.. ఓ సినిమాలో సాలిడ్ క్యామియో రోల్‌లోను ప్రభాస్ కనిపించనున్నాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు మంచి విష్ణు హీరోగా.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప.

 

ఈ మూవీలో పాన్ ఇండియన్ వైడ్‌గా ఎంతో మంది బిగ్ స్టార్స్‌ను భాగం చేస్తూ.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మంచు మోహ‌న్ బాబు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ మూవీలో నంది పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. అయితే ప్ర‌భాస్‌ లుక్ విష‌యంలో మాత్రం మొద‌టినుంచి మేకర్స్ గోప్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నప్ప నుంచి ప్రభాస్కు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

అలా ఇటీవల వచ్చిన టీజర్ లో కూడా కేవలం ప్రభాస్ కంటి చూపు వరకు మాత్రమే మేకర్స్ చూపించారు. అయితే తాజాగా ఇప్పుడు కన్నప్ప నుంచి ప్రభాస్ షాకింగ్ లుక్ వైరల్ గా మారుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి లుక్ ను రివిల్ చేయకపోయినా.. ఎట్లిస్ట్ కన్నప్ప నుంచి ప్రభాస్‌కు సంబంధించిన అప్డేట్ అయినా వచ్చిందని సంబరపడుతున్నారు. అయితే మరి కొంతమంది అభిమానులు మాత్రం ఇలాంటి లీక్స్ బయటకి రాకుండా మేకర్స్ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.