ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2తో పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం బన్నీ పలు కాంట్రవర్సీలతో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎలా జరగబోతున్నాయి అనే అంశంపై అభిమానులతో పాటు.. బన్నీలోను భయం నెలకొందట. ఇప్పటికే తనను టార్గెట్ చేసిన వాళ్లందరికీ గట్టి సమాధానం చెప్పాలని బన్నీతో పాటు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అందుకే సినిమా విషయంలో అసలు రాజీ పడకుండా.. ఫ్యాన్స్ వంతుగా పెయిడ్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 ప్రమోషన్స్ పీక్స్ లెవెల్‌లో ఉన్నాయి.
ఇక పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లు తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఒకటి హైదరాబాదులో.. మరొకటి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ బోర్డర్‌లో ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ ఈవెంట్స్‌కు స్పెషల్ గెస్ట్ గా ఎవరిని పిలవాలని అంశంలో బన్నీ డైలమాలో ఉన్నట్లు తెలుస్తుంది. వైసిపి వాళ్ళు బన్నీకి సపోర్ట్ గా ఉన్నారు. కనుక పవన్ కళ్యాణ్, చిరుని ఇన్వైట్ చేయడం దెబైపోతుంది. ఇక వైసిపి వాళ్ళను ఇన్వైట్ చేస్తే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దూరమయ్యే అవకాశం ఉంది. టిడిపిలోను వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎన్టీఆర్‌ని పిలిస్తే మెగా ఫాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది.
దేవర రికార్డులు బద్ధలు కొట్టడం.. ఎన్టీఆర్ టాలీవుడ్ దాటి బాలీవుడ్ వరకు తన సత్తా చాటుకోవడం మెగా ఫ్యాన్స్‌కు నచ్చట్లేదట. అందుకే మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఇక టిడిపి, జనసేన వాళ్ళను ఇన్వైట్ చేస్తే వైసిపి వాళ్ళు కచ్చితంగా సినిమాకు దూరంగా ఉంటారు. అందుకే అసలు ఎవరిని పిలవాలో అర్థం కాని డైలమాలో బన్నీ ఉన్నాడని తెలుస్తోంది. కాగా తమిళనాడు నుంచి సూర్యను కచ్చితంగా ఈ ఈవెంట్‌కు పిలుస్తారని.. అలాగే కన్నడ నుంచి యష్‌ను పిలిచే అవకాశం ఉందని సమాచారం. బాలీవుడ్ ప్రమోషన్స్ కూడా వీటి తర్వాత ప్లాన్ చేస్తున్నారట. ఇక హైదరాబాదులో త్రివిక్రమ్ సహా కొందరు హాజరయ్యే అవకాశం ఉందని.. సమంతను కూడా ఇన్వైట్ చేయనున్నట్లు టాక్. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరిని పిలిచినా.. చివరకు బన్నీపై యాంటి ఫ్యాన్స్ టార్గెట్ ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.