‘ కంగువ ‘ సెన్సార్ రిపోర్ట్.. సూప‌ర్ ట్విస్ట్‌.. అస‌లు ఊహించలేదుగా..!

స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ కంగువ. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్న‌యి. ఈ క్రమంలో అంచనాలకు తగ్గట్టుగానే భారీ లెవెల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమిళ్‌లో బాహుబలి బిగ్గెస్ట్ రికార్డులను బ్రేక్ చేయడం గ్యారెంటీ అంటూ టీమ్ అంతా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక‌ టాలీవుడ్ లో సూర్య ఈవెంట్స్‌లోసంద‌డి చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. కంటెంట్ అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చుతుందని నిర్మాతలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా చూసిన వీక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Actor Surya: 'ಕಂಗುವ' ಚಿತ್ರದ ಶೂಟಿಂಗ್ ವೇಳೆ ನಟ ಸೂರ್ಯಗೆ ಗಾಯ! - Vistara News

శివ డైరెక్షన్లో తరికేసిన ఈ సినిమా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. తమిళనేటివిటీతో ఉన్నా.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా సినిమాను రూపొందించారట. ఈ క్ర‌మంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. అడ్వెంచర్ సీన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సినిమాల్లో యాక్షన్ ఊచకోత ఉన్నట్లు.. బోల్డ్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ ద్వారా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Suriya's Kanguva promises visual treat. 3 reasons why this film will be a  blockbuster - India Today

ఈ క్రమంలోనే యాక్షన్ సన్నివేశాలు భారీ రక్తపాత0 ఉన్న‌ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ రావడం అందర్నీ ఆశ్చర్యం కల్పిస్తుంది. ఏమో అడప దడపా అలాంటి యాక్ష‌న్ సన్నివేశాలు తప్పా.. ఇక యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగా ఉండవేమో అని అభిమానులు సందేహాలు మొదలయ్యాయి. ఇక ఇది సినీ ఆడియన్స్ థియేటర్లకు రప్పించేందుకు కీలకంగా మారనుంది. ఇక ఈ సినిమాను 3d అనుభవాన్ని అందించనున్నారు. త్రీడీ ఎఫెక్ట్స్‌తో సినిమాలోని యాక్షన్ సీన్స్ మరింత ఎఫెక్ట్ గా అనిపిస్తాయని టీం వెల్లడించారు. ఏదేమైనా ఇంత వైల్డ్ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ అలా రావడంతో సినిమాలో కంటెంట్ ఏలా ఉందో చూడాలని ఆసక్తి కూడా అభిమానంలో నెలకొంది. ఇక సినిమా నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సెన్సార్ యూఏ సర్టిఫికెట్ రావడంతో ఫ్యామిలీ మొత్తం కలిసి ధియేటర్లకు వెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చని మేకర్స్ వివరిస్తున్నారు.