ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సౌత్ స్టార్ హీరోస్ తమ సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అలాగే సినిమాలపై వచ్చే లాభాల్లో భారీ మొత్తాలను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి అయితే ఏకంగా సినిమాకు రూ.200 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. సూపర్ స్టార్ రజినీకాంత్ రూ.150 కోట్లు, చరణ్, ఎన్టీఆర్ రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
అయితే ప్రస్తుతం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్.. ఈ స్టార్ హీరోలు అందరి రికార్డులను బ్రేక్ చేసి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే న్యూస్ ఫిలిం వర్గాల్లో తెగ వైరల గా మారుతుంది. బన్నీ పుష్ప 2 కోసం ఏకంగా రూ.300 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేశాడట. ఇక సినిమా రిలీజ్ కి ముందే రూ.1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో జరుపుకోవడంతో ఇదంతా కేవలం బన్నీ వల్లే సాధ్యమైందని నిర్మాతలు భావిస్తున్నారని.. అంత మొత్తాన్ని అల్లు అర్జున్‌కు కట్టబెట్టడానికి కూడా బలమైన కారణం ఇదే అంటూ సమాచారం.
ఇక ఈ న్యూస్ నిజమైనట్లయితే.. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోల జాబితాలో స్థానాన్ని దక్కించుకుని గొప్ప గౌరవాన్ని దక్కించుకుంటాడు. మరోవైపు రష్మికకు రూ.10 కోట్లు, ఫాహద్‌కు రూ.8కోట్ల రెమ్యూనరేషన్ నిర్మాతలు చెల్లించినట్లు సమాచారం. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత పంపిణీ వర్గాలకు ఎలాంటి నష్టం కాకుండా ఉండాలంటే ఏ రేంజ్ లో కలెక్షన్లు రావాలి అనే ప్రశ్నకు థియేట్రికల్‌గా.. రూ.600 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాలని టాక్ నడుస్తుంది. ఇక సినిమా నాన్ థియెట్రికల్ బిజినెస్ ఇప్పటివరకు రూ.450 కోట్ల వరకు జరిగిందని టాక్.