నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో అఖండ స్పీక్వెల్.. అఖండ 2 తాండవం రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ మూవీ ఓపెనింగ్ డే బాలయ్య తన పవర్ఫుల్ డైలాగ్ తో ఆడియన్స్‌ను మెస్‌మరైజ్ చేశాడు. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. యాక్షన్ మోడ్లో బాలయ్య తన సత్తా చాటుకోగలడని నిరూపించాడు. అయితే ఇంతకు మించిన పవర్ ఫుల్ డైలాగ్స్ వీరి కాంబోలో గతంలో ఎన్నో వచ్చాయి. ఇక అఖండ ఎలాంటి సక్సెస్ అందుకున్న తెలిసిందే. హిందీ ఓటిటి లోను సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో అఖండ 2 భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కించనున్నారు.
ఇక ఈ మూవీలో బాలయ్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్‌గా మారింది. బాలయ్య దేవాలయాల పవిత్రత కాపాడే ఒక పవర్ఫుల్ ఆఘోర పాత్రలో.. హిందూ దేవాలయాలు, గ్రంథాల జోలికి ఎవ్వరు వెళ్ళిన వాళ్ళ తాటతీసే తాండవం ఆడే వ్యక్తిగా కనిపించనున్నాడని సమాచారం. ఇక అఖండను మించి సినిమాలో బాలయ్య రౌద్రం చూపించబోతున్నాడని.. ఆయన కళ్ళల్లో కోపం శత్రువులు వణుకు పుట్టించేలా ఉంటుందని.. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ.. సినిమా రూపొందనుందని.. దీంతో పాటు ఓ పాన్ ఇండియన్ పాయింట్ కూడా బోయపాటి టచ్ చేయబోతున్నాడని టాక్.
కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందుత్వం, బిజెపి ప్రభుత్వం లో హిందుత్వం మధ్యన వ్యత్యాసాలను టచ్ చేస్తే బాలయ్య రోల్ డిజైన్ చేశారట. అఖండ లో అఘోరగా బాలయ్య మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కనుక ఆఘోర 2.0 కూడా అంతకుమించేలా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. నిజంగా బాలయ్య రోల్ ఇదేవిధంగా బోయపాటి డిజైన్ చేస్తే.. ఈసారి సినిమా పీక్స్ లో ఉంటుందన్న సందేహాలు లేవు.