అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్లలో భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీ భాషలతో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఓవర్సీస్ లో 5000 థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ కు సిద్ధమవుతున్నారు. దీంతోపాటే విదేశాల్లో కూడా పర్యటించాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఓవర్సీస్ లో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ మొదలయిపోయాయి.
నార్త్ అమెరికాలో 3000 షోలు వేస్తున్నారు. ఇప్పటికే వీటి ద్వారా 4.50 లక్షల డాలర్లు వచ్చాయి. అయితే కల్కి, దేవరకు ఓవర్సీస్‌లో 500 షోలు వేస్తే వచ్చిన డబ్బులు.. పుష్ప 2కి 3000 షోలు వేస్తున్న రాకపోవడం బన్నీ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగిస్తుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రీత్యా కనీసం ఒక మిలియన్ డాలర్లు అయినా దాటాల్సింది. అలాంటిది ఇప్పటివరకు కేవలం 4.50 లక్షల డాలర్లు రావడం ట్రేడ్ పండితులను అయోమయానికి గురిచేస్తుంది. ఇక ఉత్తరా అమెరికాలో సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 25 మిలియన్ డాలర్లు రావాల్సి ఉంది.
అంత కలెక్షన్లు రావాలంటే రిలీజ్ చేసిన ప్రీమియర్ షో తో పాటు.. ఫస్ట్ డే లో వేసే అన్ని షోలకు కలిపి దాదాపు ఆరు మిలియన్ డాలర్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం కేవలం నాలుగు మిలియన్ డాలర్లే వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఒకవేళ సినిమాకు మంచి టాక్ రాకపోతే.. ఇక అక్కడ పుష్పరాజ్ పని అయిపోయినట్లే. దీంతో బయ్యర్లు కాస్త వెనకడుగు వేస్తున్నారు. అంతేకాదు టికెట్ ధరలు కూడా ఎక్కువ కావడంతో దీనికి మరింత మైనస్ అవుతుందని.. టికెట్ ధర ఏకంగా 35 డాలర్లు అంటే మన ఇండియన్ రుపీస్ లో రూ.3వేలు ఉండడంతో.. టికెట్ కాస్ట్ తగ్గిస్తే ప్రీమియర్ షోల గ్రాస్ పెరుగుతుందంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.