RC16 జాన్వితో ఆ టాప్ బ్యూటీ కూడా…!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నుంచి ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌ సినిమా రానన్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. ఆడియన్స్ ముందుకు రానున్న గేమ్ ఛేంజ‌ర్ పై.. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తెరకెక్కనుంది. RC16 రన్నింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ సినిమా షూట్ కోసం సిద్ధమవుతున్నాడు చరణ్. గతంలో ఉప్పెన లాంటి చిన్న సినిమాతోనే డైరెక్టర్‌గా మారి బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు.. రామ్ చరణ్‌తో సినిమా తీసే జాక్‌పాట్ ఛాన్స్‌ కొట్టేసాడు.

Ram Charan, Janhvi Kapoor arrive in style as 'RC 16' begins with pooja ceremony - India Today

ఈ సినిమాతో ఎలాగైనా తన సత్తా చాటుకోవాలని పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బ‌స్టర్ అందుకోవాలని కాసితో అన్నాడు బుచ్చిబాబు. ఇక గతంలోని సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయిన సంగతి తెలిసిందే. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ఆథ్లెటిక్‌ రోల్‌లో కనిపించనున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం.. చరణ్ లుక్‌ను పూర్తిగా మార్చనున్నాడని టాక్. ఇక ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్ హీరోయిన్గా ఫిక్సయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న టాక్ ప్రకారం మరో టాప్ బ్యూటీ కూడా సినిమాలో హీరోయిన్గా నటించనుందట. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు.

After 'Ala Vaikunthapurramuloo,' Ram Charan, Samantha's 'Rangasthalam' to be released in Hindi? | Telugu Movie News - Times of India

ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆమె రోల్ సినిమాలో చాలా స్పెషల్‌గా ఉండనుంద‌ని.. దీంతో సమంత స్టోరీ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక గతంలో సమంత – చరణ్ కాంబోలో తెర‌కెక్కిన రంగస్థలం నాన్ బాహుబలి థియేట్రిక‌ల్‌ రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో మరోసారి సినిమా రూపొందుతుందని తెలియడంతో.. అభిమానుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఇక ఆర్సి16 ను వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం దర్శకుడుగా వ్యవహరించనున్నాడు. అయితే సమంత రోల్‌పై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.