నందమూరి నటసింహం బాలకృష్ణ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్.. 3 సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తిచేసుకుని నాలుగో సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగో సీజన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య తన హోస్టింగ్‌తో ఇండియాలోనే టాప్ టిఆర్పి రేటింగ్‌తో నిలబడ్డాడు. హీరోగా ఎన్నో సూపర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ అంటూ డిజిటల్ వరల్డ్‌లోను తన ముద్ర వేసుకున్నాడు. ఇప్పటికే ఈ టాక్‌షోలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రాజమౌళి, సుకుమార్, బోయపాటి ఇలాంటి ఎంతోమంది టాప్ స్టార్ సెలబ్రిటీస్ అంతా సందడి చేశారు.
అంతేకాదు బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు సీజన్ 4లో ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇతర భాషల నుంచి కూడా ఎంతోమంది సెలబ్రిటీస్ రానున్నారని టాక్. ఇప్పటికే ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ షూట్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ శుక్రవారం.. (రేపు) ఆహా ఓటిటి ప్లాట్ఫామ్ పై స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో బాబు, బాలయ్యల సంభాషణ ప్రోమో నెటింట వైరల్ గా మారింది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య, చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించినట్లు.. దీనిపై ఇద్దరు మాట్లాడుకున్నట్లు టాక్. అయితే వీరు ఎన్టీఆర్ పై ఎలా రియాక్ట్ అయ్యారు.. ఏం మాట్లాడుకున్నారు.. అనేది మాత్రం తెలియాలంటే అక్టోబర్ 25న స్ట్రీమింగ్ కానున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4.. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
అంతేకాదు పాలిటిక్స్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ టాక్ షోలో ముచ్చటించారట. అవకాశవాది చంద్రబాబు అని.. ఆయనపై ఉన్న అపవాద నిజమా.. జనసేనతో పొత్తు విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు.. ఇక వారి పాలనలో రెడ్ బుక్ పేరిట రాజ్యాంగ విరుధ్ధ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా.. ప్రత్యర్థులను అన్యాయంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారా.. లేదా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయా.. ఇలా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని.. ముందు సీజన్లకు మించిన కంటెంట్ ఆన్‌స్టాపాబుల్ సీజన్ 4లో.. ఫస్ట్ ఎపిసోడ్లో ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఏ రేంజ్ లో ఈ ఎపిసోడ్ హిట్ అవుతుందో వేచి చూడాలి.