మహేష్ మూవీలో సూపర్‌స్టార్ కృష్ణ.. జక్కన్న మ్యాజిక్‌…!

దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెర‌కెక్కించనున్న‌ సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం జక్కన్న తాజాగా కొత్త పాఠాలు అభ్య‌శించనున్నాడట. ఆర్‌ఆర్ఆర్ సినిమా పూర్తయి రెండేళ్లయిన ఇంకా మ‌హేష్ సినిమా సెట్స్‌పైకి రాకపోవడానికి కూడా కారణం అదే అని తెలుస్తుంది. మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న క్రమంలోనే.. రాజమౌళి మరింత అప్డేట్ అయ్యేందుకు ప్రయత్నాల్లో ఉన్నాడట. ఇంతకీ సినిమాను రెండేళ్ల నుంచి పక్కన పెట్టేసి మరీ జక్కన్న నేర్చుకుంటున్న కొత్త పాటలు ఏంటి.. అనుకుంటున్నారా.

Is this Mahesh Babu's new look for SSMB29 - Telugu News - IndiaGlitz.com

మహేష్ సినిమా కోసం.. రాజమౌళి ఏఐ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అన్ని పనులు పక్కనపెట్టి మరీ లేటెస్ట్ టెక్నాలజీ గురించి కొత్త క్లాస్‌లు నేర్చుకుంటున్నాడు జక్కన్న. తెలుగు మూవీ టెక్నికల్గా టాప్ రేంజ్‌లో చూపించిన ఘనత రాజమౌళికే సొంతమవుతుంది. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వాడడం మొదలుపెట్టిన తెలుగు దర్శకుడు కూడా రాజమౌళినే. ఇప్పుడు కొత్తగా ఏఐ ట్రైనింగ్ కూడా తీసుకుని జక్కన్న తెలుగు సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా చూపనన్నాడట. ఇక పాన్‌ఇండియా లెవెల్ సినిమాలను తీయకముందే రాజమౌళి.. ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ను తెరపై చూపించిన సంగతి తెలిసిందే.

Mosagallaku Mosagadu Latest News in Telugu, Mosagallaku Mosagadu Top  Headline, Photos, Videos Online | Chitrajyothy

ఈ క్రమంలోనే ఈసారి మహేష్ బాబు పాన్ వరల్డ్‌ సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణను కూడా చూపించబోతున్నాడని టాక్ అభిమానుల్లో నడుస్తుంది. ఎలాగో మహేష్ తో తెర‌కెక్కించనుంది అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామా కనుక.. గతంలో కృష్ణ చేసిన మోసగాళ్లకు మోసగాడు మూవీలోని పాత్రను రి క్రియేట్ చేస్తే సరిపోతుందని.. ప్రస్తుతం జక్కన కూడా దీని కోసమే ట్రైనింగ్ తీసుకుంటున్నాడని టాక్ నడుస్తుంది. మరి ఈ విషయంలో రాజమౌళి ప్లానింగ్ ఏంటో తెలియాలంటే సినిమా సెట్స్‌ పైకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే. రీసెంట్‌గా ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ సినిమాపై మాట్లాడుతూ తన అన్ని సినిమాల్లో జంతువులు ఉంటాయని.. అలాగే మహేష్ బాబు సినిమాల్లో మరిన్ని జంతువులతో సీన్స్ ఉండబోతున్నాయని వెల్లడించాడు. ఈ క్రమంలో యానిమల్ క్రియేషన్స్ విషయంలో కూడా ఈ టెక్నాలజీనే వాడబోతున్నారని తెలుస్తోంది.