నాకు అలాంటి వాడే కావాలి.. అది చేస్తేనే నచ్చుతారు.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్..

సామాన్యుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు వయసుకు వచ్చిన ప్రతి అమ్మాయిజ్ర్ తనకు కాబోయే భర్త ర్లా ఉండాలి.. అలా ఉండాలి అని ఎన్నో కోరికలు ఉంటాయి. తమ భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో.. వాళ్ళు ముందే ఊహించుకుని పెట్టుకుంటారు. దానికి సరిపోయే వ్యక్తి కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఆ క్వాలిటీస్ ను సమయo వచ్చినప్పుడు తమ సన్నిహితుల దగ్గర కూడా వారు వెల్లడిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్ కూడా తను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలో వెల్లడించింది. అలాంటివాడే ఆమెకు కావాలని.. అది చేస్తేనే నాకు నచ్చుతారు అంటూ శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ శృతిహాసన్ కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం.

Kamal makal Sruthy I Interview with Sruthy Hassan - Part 4 I Mazhavil  Manorama - YouTube

శృతిహాసన్ మాట్లాడుతూ తాను చేసుకునేవాడు అందరికీ ఆదర్శంగా నిలవాలని.. నన్ను ఎప్పుడూ జోక్స్ వేసి నవ్విస్తూ ఉండాలని.. చాలా క్రియేటివ్ గా ఆలోచించాలని, ఇతరులను ఇన్స్పైర్ చేసేలా తను మాట్లాడాలని.. అలాంటివాడు అంటే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోని శృతిహాసన్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారడంతో.. శృతిహాసన్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ జ్ఞాపకాలను బయటకు తవ్వుతూ.. నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శృతిహాసన్ మొదట్లో ఫారినర్ మైకల్ కోర్సులతో ప్రేమలో పడి చాలా కాలం రిలేష‌న్‌ కొనసాగించింది. సినా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అతనితో ప్రేమలో పడిన అమ్మడు తనతో బ్రేకప్ అవడంతో మూవీస్ కూడా పక్కన పెట్టేసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

Shruti Haasan, Shantanu Hazarika: Recent Split News, Here's the Latest  Update - Times Applaud

చాలాకాలం తర్వాత మళ్లీ కోల్కొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కొంత‌కాలానికి ముంబైకి చెందిన ఆర్టిస్ట్ శాంతాను హాజారికాతో ప్రేమలో పడింది. ఇతనితోను చాలా క్లోజ్ గా మూవ్ అయ్యింది. అయితే ఈసారి మాత్రం కాస్త జాగ్రత్తగా ఈ ముద్దుగుమ్మ శాంతానుతో బ్రేకప్ అయినా దానిని బ్రెయిన్ వరకు తీసుకోలేదు. శాంతానుతో జర్నీ క్రేజీ ప్రయాణం అని.. తనతో ఉన్నంతకాలం తన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం టు వెల్లడించి. తర్వాత బ్రేకప్ చెప్పేసింది. ఈ క్రమంలోనే శృతిహాసన్ కు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు జ‌నం. నువ్వు కోరుకున్న లక్షణాలు ఈ ఇద్దరిలోనూ లేవా.. వారితో ఎందుకు డేటింగ్ చేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.