టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్విని హీరోయిన్గా నటించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అంతే కాదు.. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా వైవిధ్యతను చాటుతాయని.. శంకర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సినిమాను రూపొందించాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక శంకర్‌కు ఈ మూవీ లైఫ్ అండ్ డెత్ క్వష్చన్ లాంటి సినిమా కావడంతో.. ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్త దారి ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెరకెక్కే భారీ బడ్జెట్ సినిమాలకు.. కచ్చితంగా మంచి హైప్ నెలకొంటేనే కానీ.. సినిమాలు గట్టెక్కడం కష్టమవుతుంది. ఇలాంటి క్రమంలో గేమ్ ఛేంజర్ సినిమాను సరికొత్తగా ప్రమోట్ చేయడానికి దిల్ రాజు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడట. ఆయన నయా ప్లాన్ వర్కౌట్ అయితే మరిన్ని సినిమాలు ఫాలో అవుతాయి అనడంలో సందేహం లేదు. ఇంతకీ ఆస్ట్రాటజీ ఏంటో అనుకుంటున్నారా.. గేమ్ చేంజర్ లోనే హైలెట్ గా ఉండే ఓ యాక్షన్స్ సీన్ ఫుల్ ఎపిసోడ్ గా రిలీజ్ చేయనున్నారట.
యూట్యూబ్లో విడుదల చేసి.. సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసి.. సినిమాకు ఆ వీడియోతో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇప్పటివరకు అలా ఫుల్ హైలెట్ యాక్షన్ ఎపిసోడ్ ని.. ఏ సినిమా ప్రమోషన్స్ లోను రిలీజ్ చేయలేదు. రామ్ చరణ్ యాక్షన్ ఎపిసోడ్ గ్యారంటీగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇక ఈ ఫైట్ చూస్తే సినిమా మరే రేంజ్‌లో ఉంటుందో అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా.. దానిని రిలీజ్ చేయాలని దిల్ రాజు, శంకర్ భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకున్నా.. ఇండస్ట్రీలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఇక బాలీవుడ్ ప్రమోషన్స్‌కు కూడా చరణ్‌ను తీసుకువెళ్లి మరి సినిమా ప్రమోట్ చేయాలని ఆలోచనలు దిల్ రాజు ఉన్నాడని.. దీపావళి నుంచి ప్రమోషన్స్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.