ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లయినా ఆ మ్యాటర్ లో ఇప్పటికీ ఫెయిల్.. రానా షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ యాక్టర్ దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నటుడుగానే కాదు.. నిర్మాతగాను ఎన్నో సినిమాలకు వ్య‌వ‌హ‌రించిన‌ ఈ హ్యాండ్సమ్‌ హీరో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇటీవల 20 ఏళ్లు పూర్తయింది. ఇక రానాకు తన సినీ కెరీర్‌లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చి పెట్టిన సినిమా అంటే బాహుబలి. ఈ సినిమాలో బల్లాలదేవ క్యారెక్టర్‌లో.. పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు రానా. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

Rana Daggubati interview for vettaiyan movie launch #ranadaggubati  #rithikasingh - YouTube

ఇదిలా ఉంటే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో చరిత్ర సృష్టించిన.. ఆల్ వి ఇమేజిన్ లైట్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను రానా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో ఘనతను కూడా దక్కించుకున్నాడు రానా. ఎంత ప్రతిష్టాత్మకమైన ఆసియా పసిఫిక్ స్క్రీన్ పురస్కారాల్లోనూ ఐదు నామినేషన్ లో చోటు దక్కించుకుని రికార్డ్ సృష్టించాడు. నవంబర్ 30న ఆస్ట్రేలియాలో ఈ వేడుకలు గ్రాండ్గా జరగనున్నాయి. ఈ సందర్భంగా రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తాడు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

Rana Daggubati loses 30 kilos for 'Haathi Mere Saathi'

ఇందులో రానా నేను ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు గడిచాయి. ఇప్పటికి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారో తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలవ‌న‌వ‌స‌రం లేదు.. కథలో కంటెంట్, ఎమోషన్స్ నిండి ఉంటే ప్రతి సినిమా ప్రత్యేకతను చాటుకుంటుందని తెలుసుకున్నా అంటూ వివ‌రించాడు. 2004 లో వచ్చిన బొమ్మలాట యానిమేషన్ సినిమాకు నేను ప్రొడ్యూసర్. ఈ మూవీ నేష‌న‌ల్‌ అవార్డు ద‌క్కించుకుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. దాన్ని విడుదల కోసం మేము థియేటర్లు వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో లాగా.. ఇక్కడ సినీ నిర్మాతలకు గ్రాంట్లు ఉండవు కదా అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా హిట్ చేసేస్తారని రానా వెల్లడించాడు. ప్రస్తుతం రానా చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్గా మారాయి.