గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజెర్ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. చివరికి ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 10న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. తెలుగు, హిందీ, తమిళ భాషలో సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన రెండు సాంగ్స్ కూడా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ దీపావళికి టీజర్ రిలీజ్ చేయనున్నారని.. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి అని టాక్. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో సినిమా ఫ్రీ రిలీజ్ థియెట్రికల్ బిజినెస్ లెక్కలు వైరల్‌గా మారాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా బిజినెస్ రూ.150 కోట్ల వరకు జరిగిందట. రీసెంట్గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.120 కోట్లు బిజినెస్ జరగగా.. ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ కు బిజినెస్ జరిగిందని టాక్. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం నార్త్ అమెరికాలో కావాలంటే రూ.20 కోట్లు షేర్.. 40 కోట్ల గ్రాస్ రావాలి. ఇక తమిళ్లో శంకర్‌కు ఉన్న క్రేజ్‌తో సినిమాకు రూ.25 కోట్ల ఫ్రీ రిలీజ్ థియేటర్ కల్ బిజినెస్ జరిగిందట.
రీసెంట్గా రిలీజ్ అయిన పాన్ ఇండియన్ సినిమాల బిజినెస్‌ల కంటే ఈ సినిమాకి తమిళనాడులో ఎక్కువగా బిజినెస్ జరిగింది. అలాగే హిందీ వర్షన్ కు రూ.40 కోట్లు బిజినెస్ జరుపుకుంది. ఇక మిగతా పాన్ వరల్డ్ బిజినెస్ లెక్కలను కలుపుకొని చూస్తే ఓవరాల్ గా ఫ్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ.250 కోట్లు జరిగాయని టాక్. అంటే రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొడితే గాని సినిమా సూపర్ హిట్ కాదు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది కనుక కచ్చితంగా వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఒక తెలుగు వర్షన్ ని రూ.105 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇది నిజమైతే టాలీవుడ్ హిస్టరీ లోనే కొత్త రికార్డు అనడంలో అతిశయోక్తి లేదు.